Tatkal Ticket Bookings Aadhaar: ఆధార్ లేకుంటే తత్కాల్ టికెట్ బుకింగ్స్ బంద్
Tatkal Ticket Bookings Aadhaar తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ కొత్త రూల్ జూలై 15 నుంచి అమలులోకి వచ్చింది.

Tatkal Ticket Bookings Aadhaar: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ ఇచ్చింది. ఇప్పటి నుంచి ఎవరు పడితే వారు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం లేదు. తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ కొత్త రూల్ జూలై 15 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పు గురించి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ కొత్త రూల్ ప్రకారం తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని కట్టడిచేడానికి, సామన్య ప్రయాణికులకు అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడింది.
అయితే తత్కాల్ టికెట్లను ఇది వరకు పలువురు ఏజెంట్లు భారీ సంఖ్యలో బుక్ చేస్తూ సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేకుండా చేశారు. అవే టిక్కెట్లను ప్రైవేటు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుని దోచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.