APAAR ID : విద్యార్థులందరికీ ఒకే ఐడీ.. APAAR ID అంటే ఏంటి? ఎలా పొందాలి?

APAAR ID : భారత ప్రభుత్వం డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే APAAR ID. ఈ ఐడీ ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు. ఇది వారి చదువుకు సంబంధించిన అన్ని వివరాలను ఒకే చోట సురక్షితంగా నిల్వ చేస్తుంది. APAAR ID అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దీన్ని ఆన్‌లైన్‌లో ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
APAAR ID అంటే ఏమిటి?
APAAR అంటే Automated Permanent Academic Account Registry. దీన్ని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) కింద రూపొందించారు. ఇది ఒక డిజిటల్ బ్యాంక్ ఖాతా లాంటిది. కానీ డబ్బుకు బదులుగా విద్యార్థుల విద్యా వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో స్కూల్ లేదా కాలేజీలో చేరడం, పాస్ అయిన తరగతులు, కోర్సు క్రెడిట్‌లు, సర్టిఫికేట్‌లు, డిగ్రీలు వంటివి ఉంటాయి.
Read Also : Saif Ali Khan : 10 ఏళ్ల పోరాటం వృథా.. రూ.15,000కోట్లు నష్టపోయిన దేవర విలన్
APAAR ID వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ చదువుకు సంబంధించిన మొత్తం సమాచారం డిజిటల్‌గా, సురక్షితంగా ఉంటుంది. ఒక స్కూల్/కాలేజీ నుంచి మరొక స్కూల్/కాలేజీకి మారినప్పుడు, మీ రికార్డులను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్‌లు పోతాయన్న భయం ఉండదు. ఎందుకంటే అవి డిజిటల్‌గా భద్రంగా ఉంటాయి. నకిలీ సర్టిఫికేట్‌లు, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడుతుంది. మీ విద్యా ప్రగతిని జాతీయ స్థాయిలో సులభంగా ట్రాక్ చేయవచ్చు.
APAAR IDని ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి?
APAAR IDని పొందడం చాలా సులభం. దీని కోసం ముందుగా, విద్యార్థి లేదా దరఖాస్తు చేసుకునేవారు తమ స్కూల్‌ను సంప్రదించాలి. స్కూల్ మీ వివరాలను (పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తరగతి) UDISE+ పోర్టల్లో అప్‌డేట్ చేస్తుంది. ఆ తర్వాత, విద్యార్థి తమ ఆధార్ కార్డు వివరాలతో డిజిలాకర్ లో లాగిన్ కావాలి. డిజిలాకర్‌లో లాగిన్ అయిన తర్వాత, APAAR ID ఆప్షన్‌ను ఎంచుకుని, దానికి అనుమతి ఇవ్వాలి. కొన్ని సెకన్లలోనే మీ APAAR ID జనరేట్ అవుతుంది. అది మీ డిజిలాకర్‌లో సేవ్ అవుతుంది.విద్యార్థి మైనర్ అయితే, వారి తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి.
Read Also : Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
APAAR ID కోసం ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు. కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు. స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. APAAR ID అనేది భారతదేశంలో విద్యను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంలో ఒక పెద్ద ముందడుగు. ఇది విద్యార్థులకు వారి విద్యా ప్రయాణాన్ని మెరుగ్గా ట్రాక్ చేయడానికి, అవసరమైనప్పుడు తక్షణమే తమ రికార్డులను యాక్సెస్ చేయడానికి సాయపడుతుంది.
-
NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!
-
Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
-
Baal Aadhaar : ‘బాల్ ఆధార్’ వ్యాలిడిటీ 5 ఏళ్లే..ఆలస్యం చేస్తే పనికిరాదు.. ఇప్పుడు ఏం చేయాలంటే ?
-
Loan for MBBS Study: MBBS చదవాలంటే ఎంత రుణం గరిష్టంగా పొందవచ్చంటే?
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి