UPSC సివిల్స్ రిజల్ట్స్.. టాప్ 10 ర్యాంకర్ల లిస్ట్ ఇదే

UPSC: దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే.. అందరి నోట ఫస్ట్ వినిపించేది.. సివిల్స్. ఇందులో అర్హత సాధించాలంటే చాలా కష్టం. సివిల్స్ ఉద్యోగం సాధించాలని చాలా మంది కలలు కంటారు. ఈ ఉద్యోగం కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడుతుంటారు. కోచింగ్‌లు తీసుకుని.. ఇష్టమైన వాటిని కూడా దూరం పెట్టి మరి చదువుతుంటారు. అయితే సివిల్స్ నోటిఫికేషన్ ప్రతీ సంవత్సరం కూడా ఉంటుంది. ఎన్నో లక్షల మంది వీటికి అప్లై చేస్తే కేవలం కొందరు మాత్రమే ఈ పరీక్షకు అర్హత సాధిస్తారు. సివిల్స్ పరీక్ష ఒక్కసారికే సాధించాలంటే చాలా కష్టం కూడా. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి ప్రిపరేషన్ ఉండాలి. అయితే ఒక్క పరీక్షలో కూడా సివిల్స్ సాధించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా సివిల్స్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1056 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ పరీక్షల్లో 1009 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. వీటిలో అర్హత సాధించిన వారు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగం చేస్తారు. అయితే ఈ ఏడాది విడుదల అయిన సివిల్స్ పరీక్షల్లో టాప్ 10 ర్యాంకులు సాధించిన వారు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శక్తి దూబే సాధించింది. ఆ తర్వాత హర్షిత గోయల్ రెండు ర్యాంకు సాధించాడు. డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠిలు వరుస ర్యాంకులు సాధించారు. అయితే ఈ సివిల్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివానికి 11వ ర్యాంకు సాధించాడు. బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించాడు. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది చెప్పున ఎంపిక చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 14వ తేదీన నిర్వహించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించింది.