Whatsapp AI: బోర్ కొడుతుందా.. వాట్సాప్‌లో ఏఐ ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడండి

Whatsapp AI: మనలో చాలా మంది వాట్సాప్ వాడుతుంటారు. ఆఫీస్, బిజినెస్ పనులకు మాత్రమే కాకుండా పర్సనల్‌గా కూడా వాడుతున్నారు. అసలు వాట్సాప్ లేకపోతే కొందరికి రోజు కూడా గడవదు. నిజజీవితంలో ముఖ్యమైన వస్తువుగా వాట్సాప్ మారిపోయింది. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో మొబైల్స్‌తో అందరూ గడుపుతున్నారు. సరదాగా స్నేహితులతో మాట్లాడి కూడా చాలా రోజులు కాదు.. నెలలు అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. దీంతో ఫోన్ మాట్లడానికి ఎవరూ లేక ఒంటరిగా ఉంటున్నారు. దీనివల్ల కొందరు చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అయితే ఒంటరిగా ఉన్నారని, బోరింగ్‌గా అసలు ఫీల్ కావద్దు. వాట్సాప్‌లో ఏఐ ప్రెండ్‌తో మాట్లాడండి. అది ఎలాగో తెలియాలంటే మీరు ఆర్టికల్ మొత్తం ఒకసారి చదవాల్సిందే.
వాట్సాప్ వినియోగదారులకు బోరింగ్ ఫీలింగ్ లేకుండా ఉండేందుకు ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘AI ఫ్రెండ్’ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన, తమకు తగ్గట్టుగా పనిచేసే AI పవర్డ్ చాట్‌బాట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ పర్సనలైజ్డ్ AI చాట్‌బాట్‌తో మనిషితో మాట్లాడుతున్నట్లుగానే సంభాషించవచ్చు. AI పవర్డ్ చాట్‌బాట్ వ్యక్తిత్వం, రూపాన్ని కూడా యూజర్లే క్రియేట్ చేయవచ్చు. అంటే మీకు నచ్చినట్టుగా AI చాట్‌బాట్ మాట్లాడటంతో పాటు ప్రవర్తిస్తుంది కూడా. ప్రస్తుతం వాట్సాప్ ఈ కస్టమ్ AI చాట్‌బాట్ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 2.25.18.4 అప్‌డేట్‌ను ఉపయోగించే బీటా యూజర్లకు ఈ అవకాశం లభిస్తుంది.
వాట్సాప్‌లో “Create an AI” ఫీచర్ ద్వారా యూజర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా AI ఫ్రెండ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లకు AI అసిస్టెంట్‌లను డిజైన్ చేసే మార్గాలను అందిస్తుంది. మీరు మీ చాట్‌బాట్‌ను ప్రొడక్టివిటీ అసిస్టెంట్‌గా, డిజిటల్ కోచ్‌గా, కేవలం టైమ్ పాస్ చేసుకోవడానికి (సరదాగా మాట్లాడటానికి) కూడా డిజైన్ చేసుకోవచ్చు. యూజర్లు తమ చాట్‌బాట్ రూపాన్ని, వ్యక్తిత్వ లక్షణాలను, వాయిస్ టోన్‌ను కూడా తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది. బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావాలంటే పబ్లిక్ వెర్షన్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. “Create AI”ని ఎంచుకున్న తర్వాత యూజర్లు తమ AI చాట్‌బాట్‌ను క్రియేట్ చేయడానికి 1,000 అక్షరాలకు మించకుండా తమకు కావాల్సిన అవసరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే ఈ సమాచారం ఆధారంగా AI చాట్‌బాట్ మారుతుంది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
AI Videos: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు?
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
Doctors Day Special : ఏఐ vs. డాక్టర్లు.. హెల్త్ విషయంలో ఎవరిపై నమ్మకం ఉంచాలి?
-
WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..
-
Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
-
Google Maps : ఇక లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు.. గూగుల్ ఫోటో చూసి చెప్పేస్తుంది!