Google Maps : ఇక లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు.. గూగుల్ ఫోటో చూసి చెప్పేస్తుంది!

Google Maps : ఐఫోన్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గూగుల్ మ్యాప్స్‌లో వచ్చిన కొత్త ఫీచర్ చూస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం. ఇకపై మీరు ఏదైనా కొత్త ప్లేస్‌ను చూడగానే స్క్రీన్‌షాట్ తీస్తే చాలు, ఆ ఫోటోలో ఉన్న లొకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ టక్కున కనిపెట్టేస్తుంది. అడ్రస్‌తో సహా మొత్తం సమాచారం మీ ముందు ఉంచుతుంది. అంటే, మీరు ఎక్కడికి వెళ్లినా ఆ ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ వెతకాల్సిన పని లేదు. అదెలాగో తెలుసుకుందాం.
గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మీ ఐఫోన్‌లో ఒక పర్సనల్ సెక్రటరీలా పనిచేస్తుంది. మీరు సోషల్ మీడియాలో తిరుగుతున్నప్పుడు ఒక మంచి కేఫ్ కానీ, చూడదగ్గ ప్రదేశం కానీ కనిపిస్తే వెంటనే స్క్రీన్‌షాట్ తీస్తారు కదా? ఇకపై దాని పేరునో, లొకేషన్నో గుర్తుంచుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్, జెమిని AI టెక్నాలజీతో మీ స్క్రీన్‌షాట్‌లోని లొకేషన్‌ను క్షణాల్లో గుర్తించి, దానిని సేవ్ చేసుకునే ఆప్షన్‌ను మీకు కల్పిస్తుంది. కొత్త కొత్త కేఫ్‌లు, రెస్టారెంట్‌లు లేదా టూరిస్ట్ స్పాట్‌లను ఎప్పుడూ వెతుకుతూ ఉండే ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ నిజంగా ఒక వరం లాంటిది. మీకు నచ్చిన ప్లేస్‌లు ఇకపై మిస్ అవ్వవు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ వాటిని మీకోసం భద్రంగా ఉంచుతుంది.
Read Also:Viral Video : కళ్లు మూసి తెరిచేలోపే ఫోన్ మాయం.. దొంగలకు అడ్డాగా మారిన బస్సు
ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి?
ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే ముందుగా మీ ఐఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి కింద ఉన్న ‘You’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ‘Screenshots’ అనే కొత్త లిస్ట్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న డెమో కూడా అక్కడ ఉంటుంది.
మీ గ్యాలరీలో ఉన్న స్క్రీన్‌షాట్‌ల నుండి గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్‌గా స్థలం పేరు, లొకేషన్‌ను గుర్తిస్తుంది. తర్వాత ఒక రివ్యూ స్క్రీన్ వస్తుంది. అందులో గూగుల్ కనిపెట్టిన రిజల్ట్‌ను మీకు చూపిస్తుంది. మీకు ఆ లొకేషన్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఇది పూర్తిగా మీ ఇష్టం. మీరు ఒక లొకేషన్‌ను సేవ్ చేసినప్పుడు, అది మీ ‘Screenshots’ లిస్ట్‌లోకి వెళ్తుంది. కావాలంటే మీరు దానిని వేరే లిస్ట్‌లోకి కూడా తరలించవచ్చు.
Read Also:Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
మీరు గూగుల్ మ్యాప్స్‌కు మీ ఫోటోలన్నింటికీ యాక్సెస్ ఇస్తే, అది మీరు కొత్తగా తీసిన స్క్రీన్‌షాట్‌లను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి, లొకేషన్‌ల ఒక చిన్న కేరోసెల్‌ను మీకు చూపిస్తుంది. దీనివల్ల మీరు సరైన లొకేషన్‌ను ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు మ్యాన్యువల్‌గా చేయాలనుకుంటే.. మీ గ్యాలరీలోకి వెళ్లి స్క్రీన్‌షాట్‌లను సెలెక్ట్ చేసి స్కాన్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఒక క్లియర్ బటన్ కూడా ఉంటుంది. నిజంగా ఇది ఐఫోన్ యూజర్లకు ఒక అద్భుతమైన ఫీచర్ కదూ!
-
Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
-
Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
-
Android 16 : ఆండ్రాయిడ్ 16తో దొంగలకు షాక్.. ఫోన్ దొంగిలిస్తే అంతే సంగతులు!
-
iPhone : పాత ఐఫోన్‌ను కొత్తగా మార్చే అప్‌డేట్.. iOS 18.5 ఫీచర్లు ఇవే!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
-
Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?