Viral Video : కళ్లు మూసి తెరిచేలోపే ఫోన్ మాయం.. దొంగలకు అడ్డాగా మారిన బస్సు

Viral Video : ఢిల్లీ దేశ రాజధానిగా మాత్రమే కాకుండా నేరాలకు కూడా రాజధానిగా కూడా పేరుగాంచింది. ఇక్కడ రోజూ రకరకాల నేరాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు.ఇక్కడి దొంగలు ఎంత తెలివైనవారంటే, అవకాశం దొరికితే మీ కళ్ల ముందే మీ వస్తువులను మాయం చేస్తారు. మాయం చేశారన్న విషయం కూడా ఎవరీ తెలియదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఢిల్లీలోని DTC బస్సులో ఒక దొంగ అవకాశం చూసి చాలా తెలివిగా దొంగతనం చేశాడు. ఈ దృశ్యం బస్సులో అమర్చిన కెమెరాలో రికార్డయింది.
దొంగలు అవకాశం కోసం ఎదురు చూసి తమ పని న్యాక్ గా పూర్తి చేస్తారు. వారు ఎవరిని దోచుకుంటున్నారో వారికి ఏమాత్రం ఎలాంటి అనుమానం రాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు వారు ఒంటరిగా కాకుండా పూర్తిగా గ్రూప్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియోను చూడండి. DTC బస్సులో ఒక వ్యక్తి పట్టపగలు ఫోన్ దొంగిలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దొంగలు ఈ పనిని ఎంత ప్లాన్‌తో చేశారంటే ఆ వ్యక్తికి ఏమీ తెలియకుండా అతని ఫోన్ మాయమైపోయింది. ఈ మొత్తం ఘటన పైన ఉన్న CCTV కెమెరాలో రికార్డయింది.
Read Also: Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
दिल्ली की बसों पर जेबकतरों का कब्ज़ा हो चुका हैं ।
कई बार बता चुका हूं लेकिन देश की राजधानी दिल्ली में कोई सुनने वाला नही है और जेबकतरों के ग्रुप दिनदहाड़े खुलेआम लूट मचा रहे है ।@dtchq_delhi @DimtsLtd @drpankajbjp @gupta_rekha @CMODelhi @AtishiAAP @Saurabh_MLAgk @BBCHindi @ANI pic.twitter.com/Vgq6eqNhJ4
— Delhi Buses (@DELHIBUSES1) May 16, 2025
వీడియోలో ఒక జేబుదొంగల ముఠా మొత్తం బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో వారు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని బాగా ప్లాన్ ప్రకారం పనిచేస్తారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ వ్యక్తి దగ్గరకు చేరుకుని అతని మొబైల్‌ను చాటుగా దొంగిలిస్తారు. ఇదంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రయాణికులకు, బస్సు డ్రైవర్‌కు వారిలో ఎవరిపైనా అనుమానం రాదు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు చెప్పేది ఒక్కటే.. ఇలాంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఐదు లక్షల మందికి పైగా దీనిని చూశారు. కామెంట్లు చేస్తూ ఈ దొంగలపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఒక యూజర్ రాస్తూ.. పట్టుబడితే అన్నయ్య మొబైల్ దొంగిలిస్తాడు, క్షమాపణ అడుగుతాడు. క్షమించమని అడిగితే వదిలేయండి భయ్యా ఇక! అని రాశాడు. మరొకరు రాస్తూ, ఈ వ్యక్తి పట్టుబడితే అతని టీమ్ సభ్యులే అతడిని చితక్కొడతారు అని రాశారు.
Read Also:Mission Impossible The Final Reckoning Review: మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్ రివ్యూ
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
-
Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
-
Cigarette Dispute : సిగరెట్ ఇవ్వలేదని రెచ్చిపోయిన గూండా.. షాపులో 15 రౌండ్లు కాల్పులు!