Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

Viral Video : ఢిల్లీ మెట్రో ఇప్పుడు రీల్స్ చేసేవాళ్లకు అడ్డాగా మారిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. రోజూ ఎంతోమంది కంటెంట్ క్రియేటర్లు ఇక్కడికి వచ్చి రకరకాల రీల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కొన్ని వీడియోలు అయితే చూడటానికి కూడా చిరాకుగా అనిపిస్తుంటాయి. అయితే, ఢిల్లీ మెట్రోలో షూట్ చేసిన ప్రతి వీడియో అలానే ఉండాలని లేదు. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి మానవత్వం చూపిస్తూ ఒక వ్యక్తికి సహాయం చేసింది. కానీ చివర్లో ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
సాధారణంగా మెట్రోలో గొడవలకు ప్రధాన కారణం ఏంటని ఎవరిని అడిగినా సీటు అని టక్కున సమాధానం చెబుతారు. సీటు దొరికితే చాలు, ఎవరూ వదలడానికి సిద్ధంగా ఉండరు. దాని కోసం కొట్టుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుని తన సీటును అతనికి ఇచ్చేసింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ లెవల్లో ఆ యువతిలో మానవత్వాన్ని ఎవరూ ఊహించలేదు. కానీ ఇది ఒక ప్రాంక్ అని చివర్లో తేలింది. అందులో ఆ అమ్మాయి చిక్కుకుంది.
Read Also:Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
DELHI METRO IS NOT FOR BIGNER👇 pic.twitter.com/zFscM6gvaf
— 𝗗𝗲𝘀𝗶 Crap (@desiicrap) May 15, 2025
వీడియోలో మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఒక యువకుడు చేతిలో పసిపాప ఉన్నట్లుగా వస్తాడు. అది చూసిన ఒక అమ్మాయి వెంటనే తన సీటును అతనికి ఇస్తుంది. ఆ వ్యక్తి బిడ్డతో హాయిగా కూర్చుంటాడడని ఆమె అనుకుంది. కానీ సీటులో కూర్చున్న వెంటనే ఆ వ్యక్తి తన అసలు రంగు చూపిస్తాడు. దుప్పటిని తీసివేస్తాడు. అప్పుడు అందరికీ తెలుస్తుంది అతని దగ్గర బిడ్డ లేదని. ఇది చూసిన మెట్రోలోని ప్రయాణికులందరూ నవ్వడం మొదలుపెడతారు.
ఈ వీడియోను @desiicrap అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేల మంది దీన్ని చూశారు. కామెంట్లు పెడుతున్నారు. చాలా మందికి ఈ ప్రాంక్ నచ్చింది. కానీ కొంతమంది మాత్రం మానవత్వంపై నమ్మకం పోగొట్టుకున్నారు.
Read Also:Mission Impossible The Final Reckoning Review: మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్ రివ్యూ
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!