Mission Impossible The Final Reckoning Review: మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్ రివ్యూ

Mission Impossible The Final Reckoning Review: ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాల కోసం కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ తాళాలు వాళ్లకి దొరకకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు. అయితే ఈ తాళం కావాలంటే ఒక కోడ్ ఉండాలి. ఈ కోడ్ సముద్ర గర్భంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ఉంటుంది. దీన్ని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడామని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్ (ఏంజెలా బాసెట్) ఈథన్‌కు వాయిస్ నోట్ పంపిస్తారు. అయితే ఈ ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్ హంట్ చేసిన సాహసం ఏంటి? అతను ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది మూవీ స్టోరీ.
ఎలా ఉందంటే..
2023లో వచ్చిన ‘మిషన్: ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్’ హిట్ కొట్టింది. ప్రపంచాన్ని శాసించే ఎంటిటీని నియంత్రించే తాళాల కోసం ఈథన్ హంట్, అతడి టీమ్ సాహసాలు చేశారు. పార్ట్-1లో కథ, యాక్షన్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పార్ట్-2లో మాత్రం యాక్షన్ సీన్స్ కన్నా కూడా డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా అధ్యక్షురాలి చెప్పడంతో ఎంటిటీని కనిపెట్టి నాశనం చేయడానికి ఈథన్ హంట్ రంగంలోకి దిగుతాడు. ఇతన్ని అడ్డుకుని తాళాలు దక్కించుకోవాలని గాబ్రియల్ (ఇసాయ్ మోర్లెస్) ప్రయత్నిస్తాడు. అయితే ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు, డ్రామా, యాక్షన్ నెమ్మదిగా ఉంటుంది. సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్ దగ్గరకు వెళ్లడానికి మార్గానికి చూడటానికే ఫస్టాఫ్ మొత్తం అవుతుంది. ఈథన్ హంట్, అతడి టీమ్ సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్ ఉన్న దగ్గరకు వెళ్తారో.. అక్కడి నుంచి మూవీ కాస్త ఫాస్ట్‌గా వెళ్తుంది. ద్వితియార్థం మొత్తం ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. నీటి అడుగున తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు అయితే సూపర్ అని చెప్పవచ్చు. అన్నింటి కంటే ముఖ్యంగా ఎగురుతున్న విమానం మీద జరిగే క్లైమాక్స్ యాక్షన్ సీన్లు అయితే మూవీకే హైలెట్. ఇలాంటి యాక్షన్ మూవీని థియేటర్లలో చూస్తేనే ఆ ఫీలింగ్ బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
మిషన్ ఇంపాసిబుల్ సినిమా అంటే టామ్ క్రూజ్ గుర్తు వస్తారు. ఈ సిరీస్‌లో సినిమాలు ఇతను చేస్తేనే ప్రేక్షకులు అలరిస్తారు. దాదాపుగా 30ఏళ్ల పాటు నుంచి ఈ సిరీస్‌ను తీస్తున్నారు. ఈ సిరీస్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. టామ్ క్రూజ్ వయసు ప్రస్తుతం 62ఏళ్లు. అయినా కూడా స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లో ఇదే చివరి సినిమా అని అంటున్నారు. ఈ సినిమాలో మిగిలిన నటీనటులు హేలే అట్వెల్, వింగ్ రెహమ్స్, సిమన్ పెగ్, హెన్రీ సెర్నీ, ఇసాయ్ మార్లెస్ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. అండర్ వాటర్ సీక్వెన్స్, ఎయిరోప్లేన్ ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయి. అంతా బాగానే ఉంది. కాకపోతే సినిమా ఎక్కువ గంటలు ఉంది. దాదాపు 2 గంటల 50 నిమిషాలు సినిమా సమయం. టామ్‌క్రూజ్ నటన, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్లస్.
రేటింగ్ 3/5