Court: అంచనాలు లేకుండా వచ్చిన కోర్టు మూవీ.. మొదటి రోజే కలెక్షన్లు దుల్లగొట్టిందిగా!

Court:
కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మార్చి 14వ తేదీన సినిమా విడుదల అయ్యింది. అయితే విడుదలకు ముందే ప్రీమియర్స్ కూడా వేశారు. అప్పటి నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ప్రీమియర్స్, సినిమా మొదటి రోజు కలెక్షన్లు మొత్తం రూ.8.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ రోజు, రేపు వీకెండ్ కావడంతో బుకింగ్స్ కూడా ఫుల్‌గానే ఉన్నాయి.
వీకెండ్‌లో ఈ సినిమాకి రూ.15 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కోర్ట్ మూవీ మొత్తం బడ్జెట్ రూ.9 కోట్ల. ఈ మనీ ఓటీటీతోనే వచ్చేశాయి. ఓటీటీ రూ.8 కోట్లకు కొనుగోలు చేయగా.. మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి రోజే కలెక్షన్లు కొల్లగొడుతుంది. రోషన్, శ్రీదేవి యాక్టింగ్ కూడా బాగుందని నెటిజన్లు అంటున్నారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా సూపర్‌గా ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా సెక్షన్లు తెలుసుకోవాలనే కాన్సెప్ట్‌లో సినిమా వచ్చింది. ఈ సినిమాకి నాని కూడా బాగా ప్రమోషన్ చేశాడు. సినిమా బాగులేకపోతే హిట్ 3 మూవీ కూడా చూడవద్దని తెలిపాడు. దీంతో సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.
నాని శైలేష్ కొలను దర్శకత్వలో హిట్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అలాగే దసరా దర్శకుడితో పారడైజ్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది. గ్లింప్స్‌లోని ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం. గ్లింప్స్ మొత్తం చూస్తే సినిమా అనేది చాలా డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది. నానికి అసలు ఫెయిల్యూర్స్‌తో సంబంధమే లేదు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నాడు. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ ప్యారడైజ్ సినిమా పాత్ర చాలా డిఫరెంట్ ఉంటుంది. మాస్ లుక్‌లో ఇలాంటి ఒక పాత్రకు నాని ఒకే చెప్పడం ఏంటని అందరూ అంటున్నారు.
గతంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కామెడీగా వచ్చే సినిమాలకి ఒకే చెప్పేవారు. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉండే పాత్రకు ఒకే చెప్పాడు. ప్రతీ హీరో కూడా వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే నాని ఈ కొత్త ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి కథలు తీసేటప్పుడు ఫేమ్‌ను పట్టించుకోకూడదు. ఇది రిస్క్ అయినదే. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Movies: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
-
Court Collection: వర్కింగ్ డే లో కూడా బీభత్సమే..’కోర్ట్’ 4 రోజుల వసూళ్లు ఎంతంటే!
-
Yevade Subramanyam: పదేళ్ల తర్వాత నాని మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
-
Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?
-
Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా