Allu Arjun Next Movie AA23: త్రివిక్రమ్‌కి హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ డైరెక్టర్‌కి ఛాన్స్

Allu Arjun Next Movie AA23: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అల్లు అర్జున్ తర్వాత సినిమా ‘AA23’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప: ది రూల్’ తర్వాత అల్లు అర్జున్ ఏయే డైరెక్టర్లతో సినిమా చేస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నట్లు బాగా టాక్ వచ్చింది. కానీ త్రివిక్రమ్ ఈ మధ్యలో ఫామ్ లేకపోవడం వల్ల అల్లు అర్జున్‌కు నమ్మకం కోల్పోయిందని, సినిమాకి రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌కు ఛాన్స్ ఇవ్వకుండా మలయాళం బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్‌కి ఇచ్చినట్లు సమాచారం. ‘మిన్నల్ మురళి’ సినిమా దర్శకుడు బాసిల్ జోసెఫ్‌కి అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన తర్వాత ప్రాజెక్ట్ ‘AA23’ తనతోనే చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
బాసిల్ జోసెఫ్ కథన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘మిన్నల్ మురళి’ వంటి సినిమాను తక్కువ బడ్జెట్‌లోనే బాగా తీశారు. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. బాసిల్ జోసెఫ్‌కు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే కేరళలో అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగా కూడా బాసిల్ జోసెఫ్‌కు అల్లు అర్జున్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వస్తే సినిమా పక్కా హిట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ కామెడీ టైమింగ్, భావోద్వేగాలు, బలమైన కథ అన్నింట్లో దిట్ట. అల్లు అర్జున్ స్టార్‌డమ్, బాసిల్ జోసెఫ్ విజనరీ డైరెక్షన్ కలిస్తే పక్కాగా అద్భుతమైన సినిమా వస్తుందని భావిస్తున్నారు.
‘AA23’ సినిమా ఏ జానర్‌లో ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. బాసిల్ జోసెఫ్ గత చిత్రాలను బట్టి చూస్తే ఒక కొత్త కథ అయి ఉండవచ్చు. ఒకవేళ సూపర్ హీరో జానర్ అయితే ‘మిన్నల్ మురళి’ తర్వాత బాసిల్ మరోసారి ఆ జానర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరికొందరు కామెడీ లేదా ఎమోషనల్ డ్రామా కూడా కావొచ్చని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ నుండి ప్రేక్షకులు ఎంతగానో ఆశించే స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ వంటి అంశాలను బాసిల్ తనదైన శైలిలో ఎలా చూపిస్తారో చూడాలి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
-
Allu Arjun : రణ్ వీర్ కు షాక్.. శక్తిమాన్ గా రాబోతున్న అల్లు అర్జున్ ?
-
Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?