Check Bounce: చెక్ బౌన్స్ అయ్యిందా.. ఇలా చేయండి

Check Bounce: పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడానికి చాలా మంది ఇప్పటికీ చెక్కులు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఖాతాలో తగినంత డబ్బు లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల చెక్కులు బౌన్స్ (తిరిగి) అవుతుంటాయి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతుంటారు. అలాగే న్యాయ పరంగా కూడా కొన్ని సమస్యల్లో పడతారు. అయితే ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక కొందరు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ చెక్కు బౌన్స్‌ల విషయంలో సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చెక్కు బౌన్స్ కేసులను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల బాధితులకు తొందరగా న్యాయం లభిస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు ఈ కేసుల పరిష్కారానికి చాలా సమయం పట్టేది. దీనివల్ల పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కాలపరిమితిని నిర్దేశించడం వల్ల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అయితే చెక్కు బౌన్స్ కేసులలో పిటిషనర్‌కు చెక్కు మొత్తంలో 20 శాతం వరకు తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని పొందిన తర్వాత కేసు పూర్తయ్యే వరకు పిటిషనర్‌కు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. ఒకవేళ కేసు పిటిషనర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే తిరిగి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తరచుగా చెక్కులు బౌన్స్ అవుతున్న వ్యక్తులపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకునే అధికారం కల్పించారు. ఒక వ్యక్తికి చెందిన చెక్కులు పదేపదే బౌన్స్ అయితే బ్యాంకులు వారి ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయవచ్చు. ఇలాంటి చర్యలు చెక్కులను జారీ చేసేటప్పుడు మరింత బాధ్యతగా ఉండేలా చూసుకోవాలి. అయితే చెక్కు బౌన్స్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
చెక్ బౌన్స్ విషయంలో ఈ నియమాలు పాటిస్తేనే ఇతరులు పదే పదే ఇలా కాకుండా చూస్తారని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు అన్నింటి కంటే చెక్ బౌన్స్ కాకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉంటారు. దీంతో చెక్ బౌన్స్ కాకుండా జాగ్రత్త పడతారు. చాలా మంది ఈ చెక్ బౌన్స్ అయితే ఏం చేయాలో కూడా సరిగ్గా తెలియదు. దీనివల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఆర్టికల్‌ను షేర్ చేయండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.
ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
-
NEET PG Exam: ఒకే షిఫ్టులో నీట్ పీజీ పరీక్ష ఆరోజే!
-
NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!
-
NEET PG : రెండు షిఫ్టుల్లో పరీక్ష వద్దంటూ పిటిషన్..సుప్రీంకోర్టులో NEET PG భవితవ్యం
-
Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
-
Supreme Court : భారత్ ధర్మశాల కాదు.. ఇప్పటికే 140 కోట్ల మందితో పోరాడుతున్నాం : సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
Court Collection: వర్కింగ్ డే లో కూడా బీభత్సమే..’కోర్ట్’ 4 రోజుల వసూళ్లు ఎంతంటే!