NEET PG Exam: ఒకే షిఫ్టులో నీట్ పీజీ పరీక్ష ఆరోజే!

NEET PG Exam: ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్షను నిర్వహించాలని సుప్రీం ఆదేశాల మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షను వాయిదా వేసింది. ఈ క్రమంలో మరో కొత్త తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష కోసం వైద్య విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్ష కోసం కొందరు ఏళ్ల తరబడి చదువుతుంటారు. జూన్ 15 వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేశారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్షను నిర్వహించాలని భావించింది. అయితే ఇలా నిర్వహించడం వల్ల ప్రశ్న పత్రాల కఠినత్వం, అంచనా వేయడంలో తేడాలు వస్తాయని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్షను ఆగస్టు 3న నిర్వహించనున్నట్లు ఇప్పుడు తెలిపింది. ఆగస్టు తర్వాత వాయిదాకి అవకాశం ఇవ్వనని తెలిపింది. ఇప్పటికే రెండు నెలల పాటు సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించడానికి అదనపు పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది అవసరం అవుతారు. దీనికి కొంత సమయం పడుతుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుప్రీంకోర్టుకు వివరించింది.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ తో కూడిన ధర్మాసనం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విజ్ఞప్తిని పరిశీలించి, ఆగస్టు 3న పరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. అయితే, భవిష్యత్తులో ఎటువంటి వాయిదాలు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించడం వల్ల పారదర్శకత, అభ్యర్థులందరికి సమాన అవకాశాలు లభిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయంతో వేలాది మంది వైద్య విద్యార్థులకు ఉపశమనం లభించింది. పరీక్ష తేదీపై నెలకొన్న గందరగోళం తొలగిపోయింది. ఇప్పుడు విద్యార్థులు ఆగస్టు 3వ తేదీని దృష్టిలో ఉంచుకొని తమ ప్రిపరేషన్ ను కొనసాగించవచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ త్వరలోనే నీట్ పీజీ 2025కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన తేదీల వివరాలు ఆ షెడ్యూల్‌లో ఉంటాయి.
-
Check Bounce: చెక్ బౌన్స్ అయ్యిందా.. ఇలా చేయండి
-
NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!
-
NEET PG : రెండు షిఫ్టుల్లో పరీక్ష వద్దంటూ పిటిషన్..సుప్రీంకోర్టులో NEET PG భవితవ్యం
-
Supreme Court : భారత్ ధర్మశాల కాదు.. ఇప్పటికే 140 కోట్ల మందితో పోరాడుతున్నాం : సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు