RBI : ఆర్బీఐ కొత్త రూల్.. పదేళ్లు దాటిన పిల్లలకు గుడ్ న్యూస్

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు(మైనర్లు) ఇక మీదట వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లు, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను సొంతంగా ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. అంతే కాకుండా గార్డియన్ అవసకం లేకుండా వాటిని సొంతంగానే వాడుకోవచ్చు అని చెప్పింది.
ఏప్రిల్ 21న RBI ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, చిన్న వయసు నుంచే పిల్లల్లో డబ్బును మేనేజ్ చేసుకునే అలవాటును పెంచడం, వాళ్ళకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడమని సూచించింది. బ్యాంకులు ఈ కొత్త రూల్స్‌ను జూలై 1, 2025 నుంచి కచ్చితంగా అమలు చేయాలి. అకౌంట్లను సరిగ్గా చెక్ చేస్తూ, మానిటర్ చేస్తూ ఉండాలని కూడా RBI ఆదేశించింది.
కొత్త రూల్స్ ప్రకారం, పదేళ్లు దాటిన మైనర్లు తమ అకౌంట్లను గార్డియన్ అవసరం లేకుండానే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే, అకౌంట్ నిబంధనలు బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలకు సరిపోవాలి. మైనర్లు తమ లీగల్ లేదా నాచురల్ గార్డియన్ల ద్వారా కూడా అకౌంట్లు తెరవొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండి, మేజర్లు అయినప్పుడు, బ్యాంకులు అకౌంట్ రికార్డుల్లో ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్పెసిమెన్ సిగ్నేచర్లు అప్డేట్ చేయాలి.
Read Also:International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు కూడా!
బ్యాంకులు కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా, తమ రిస్క్ పాలసీలకు అనుగుణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, లేదా చెక్ బుక్కులు లాంటి అదనపు సేవలను కూడా ఈ మైనర్ అకౌంట్లకు అందించవచ్చు. అకౌంట్ పిల్లలు సొంతంగా వాడినా లేదా గార్డియన్ వాడినా, అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడూ పాజిటివ్‌గా అంటే సున్నా కంటే ఎక్కువగా ఉండాలి. అంటే, ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం మైనస్ మాత్రం అవ్వకూడదు.
ఇంతకు ముందు రూల్స్ ఎలా ఉండేవి?
ఈ కొత్త రూల్ రాకముందు ఆర్బీఐ మైనర్లను సేవింగ్స్ అకౌంట్లు తెరవడానికి అనుమతించేది. కానీ, వాటిని కచ్చితంగా గార్డియన్ ద్వారానే తెరవాలి. అంటే, తల్లిదండ్రులు లేదా గార్డియన్ మైనర్ తరపున అకౌంట్‌ను వాడేవారు. మైనర్లు మేజర్లు అయ్యేవరకు వాళ్ళ అకౌంట్లను సొంతంగా మేనేజ్ చేసుకోలేరు. మైనర్లు ఓపెన్ చేసిన అకౌంట్లు సాధారణంగా గార్డియన్ పెట్టిన రూల్స్ ప్రకారమే నడిచేవి. అలాగే, డెబిట్ కార్డులు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఇతర బ్యాంకింగ్ సేవలు సాధారణంగా మైనర్లకు అందుబాటులో ఉండేవి కావు.
Read Also:Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు