SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు

SBI: బ్యాంకుల్లో ఉద్యోగాలు చాలా ఫ్రీగా ఉంటుందని, హ్యాపీగా చేసేయవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే బ్యాంకు ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంటాయి. వీటికి పరీక్ష రాసి ఎంపిక కావాలంటే కాస్త సమయం పడుతుంది. ఎంతో స్మార్ట్‌గా ప్రిపేర్ అయితేనే అవుతుంది. ఈ బ్యాంకు ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. నిజానికి కేవలం బ్యాంకు ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అనుకుంటారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలన్నా కూడా చాలా కష్టం. అందులో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం అంటే ఎంతగానో కష్టపడాలి. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాగైనా కూడా ఎస్‌బీఐలో జాబ్ సాధించాలని భావిస్తారు. దీంతో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే అప్లై చేసేస్తారు. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా స్టోరీలో తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ibpsonline.ibps.in లోకి వెళ్లి వీటికి అప్లై చేసుకోవచ్చు. జూన్ 24వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జూలై 14 వరకు ఉంటుంది. అయితే మెుత్తం 541 పోస్టులకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వీటిలో 203 పోస్టులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. ఓబీసీ వాళ్లకు 135 పోస్టులు, 50 పోస్టులు, షెడ్యూల్డ్ కులాలు కోసం 37 పోస్టులు, షెడ్యూల్డ్ తెగలు 75 పోస్టులకు భర్తీ చేయనుంది. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సంస్థ నుంచి తప్పకుండా గ్రాడ్యుయేషన్ చేయాలి. అయితే చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా ఈ ఫారమ్‌ను ఫిల్ చేయవచ్చు. అయితే వీటికి తప్పకుండా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు. అలాగే 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే వీటిలో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఎంపికైతే రూ.48,480 వేతనం లభిస్తుంది. వీటికి టైర్-1, టైర్-2 ద్వారా ఇంటర్వ్యూలు చేస్తారు. అయితే వీటికి పరీక్ష ఆగస్టులో ఉంటుంది. వీటికి అప్లై చేసుకోవడానకి అన్‌రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.750 రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యీబీడీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.
ఇది కూడా చూడండి: WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
Railway jobs: అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్