Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక

Jobs: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తుంటారు. అందులోనూ రైల్వే ఉద్యోగమంటే తప్పకుండా ఎన్నో ఆశలతో చదువుతారు. ఈ ఉద్యోగం రావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయితే వీటి నోటిఫికేషన్లు ఎప్పుడు పడితే అప్పుడు రావు. కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క ఉద్యోగం కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఒక్కసారి రైల్వే ఉద్యోగం కనుక వస్తే ఇక లైఫ్ సెట్ అయినట్లే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమైన రైల్వే వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటివల్ల ఉద్యోగస్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 6180 పోస్టులకు భర్తీ చేయనుంది. అయితే వీటికి దరఖాస్తు ప్రక్రియ జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28. rrbapply.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌లో మొత్తం 180 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3లో మొత్తం 6000 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ టెక్నిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ, బీఎస్సీ, బీఈ, బీటెక్ వంటి వాటిలో తప్పకుండా ఉత్తీర్ణత అయి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు18 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. గరిష్టంగా 33 ఏళ్లు ఉండవచ్చు. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి కూడా ఉంటుంది. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే కేటగిరీ బట్టి డబ్బులు డిపాజిట్ చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే రూ.500 రుసుమును డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులు రూ.250తో అప్లై చేయాలి. దీనికి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పత్రాలను తప్పకుండా పెట్టి అప్లై చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మళ్లీ ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకుంటే.. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి కాస్త కష్టపడి చదవి ఉద్యోగాన్ని సంపాదించుకోండి.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్
-
Jobs : ఇంజనీర్లకు గుడ్ న్యూస్.. రూ.25వేల స్టైఫండ్ తో ప్రసార భారతిలో 421 ఉద్యోగాలు