Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. మొత్తం 4500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి కేవలం అర్హత మాత్రమే కాదు.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. జూన్ 7వ తేదీ నుంచి వీటికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. జూన్ 23వ తేదీలోగా వీటికి అప్లై చేసుకోవాలి. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎవరైతే ఎంపిక అవుతారో వారికి 12 నెలలు అనగా ఒక ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా వీటికి అప్లై చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే NATS పోర్టల్లో తప్పకుండా రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
20 నుంచి 28 సంవత్సరాల మధ్య మాత్రమే అభ్యర్థుల వయస్సు మే 2025 నాటికి పూర్తి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితి ఉంటుంది. ఇక ఓబీసీ అభ్యర్థులకు అయితే మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అయితే 10 నుంచి 15 ఏళ్లు వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అభ్యర్థులు ముందు NATS పోర్టల్ https://nats.education.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. జీఎస్‌టీతో కలిపి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800. పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు అయితే రూ.600 ఉంటుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.15వేలు స్టైపెండ్ ఇస్తారు.
ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలతో ఉంటుంది. ఇందులో మానసిక నైపుణ్యం, క్వాంటిటేటివ్, కంప్యూటర్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉంటాయి. అభ్యర్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 7వ తేదీనే ప్రారంభమైంది. జూన్ 23వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. అనంతరం జులై మొదటి వారంలో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి ఒక్క పోస్టుకు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. అయితే.. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ హామీ లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చూడండి: Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
Railway jobs: అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక