IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!

IBPS Notification: బ్యాంకు ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంటాయి. వీటికి పరీక్ష రాసి ఎంపిక కావాలంటే కాస్త సమయం పడుతుంది. ఎంతో స్మార్ట్‌గా ప్రిపేర్ అయితేనే అవుతుంది. ఈ బ్యాంకు ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఈ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. తప్పకుండా ఏడాదికి ఒకసారి అయినా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా నోటిఫికేషన్లు ఉంటాయి. అన్నింటికి ప్రిపేర్ అయి ఉద్యోగం సాధించవచ్చు. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ట్రైనీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.inలోకి వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే వీటికి రుసుము చెల్లించడానికి జూలై 21వ తేదీ చివరి తేదీ. అయితే మొత్తం 5,208 ఖాళీలను వివిధ బ్యాంకుల్లో భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో భాగంగా కొన్ని బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,000 పోస్టులు ఉన్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మొత్తం 700 పోస్టులు ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,000 పోస్టులు ఉండగా కెనరా బ్యాంకులో 1,000 పోస్టులు ఉన్నాయి. అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 పోస్టులు ఉన్నాయి. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 450 పోస్టులు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 200 పోస్టులు, పంజాబ్, సింధ్ బ్యాంకులో 358 పోస్టులకు ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఇంకా ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఖాళీలను ఇంకా వెల్లడించలేదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే జూలై 1వ నాటికి 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి విద్యార్హత కూడా ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది క్రెడిట్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా ఉంటేనే అప్లై చేసుకోవాలి. సరిగ్గా లేకపోతే తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన కూడా ఉద్యోగం రాదు. ఇటీవల ఓ వ్యక్తికి ఇలానే ఉద్యోగం రాలేదు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అయితే రూ.175 చెల్లించాలి. మిగతా వారందరూ కూడా రూ.850 చెల్లించాలి. అయితే వీటికి ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలు సెప్టెంబర్‌లో రిలీజ్ చేశాక మెయిన్ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే వీటికి అప్లై చేసుకోండి.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే