Railway jobs: అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

Railway jobs: రైల్వే ఉద్యోగం సాధించాలని చాలా మంది కలలు కంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం వల్ల ఒక్కసారిగా లైఫ్ సెట్ అవుతుందని భావిస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఒక్క పోస్ట్ కోసం ఎందరో ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఏడాదికి సంబంధించి టెక్నిషీయన్ పోస్టులను విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో విడుదల చేసిన ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అధికార వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అయితే ఆస్తక్తితో పాటు అర్హత కూడా ఉన్న వారు rrbapply.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి వీటికి అప్లై చేసుకోవాలి. అయితే ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా మొత్తం 6238 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి అప్లై చేయడానికి చివరి తేదీ జులై 28వ తేదీ. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి జులై 30వ తేదీ లాస్ట్. అయితే అప్లికేషన్లను సవరణ చేయడానికి ఆగస్టు 1వ తేదీన ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ వరకు ఉంటుంది. వీటికి వయో పరిమితి జులై 1వ తేదీ వరకు ఉంటుంది. అయితే టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు అయితే అభ్యర్థులకు తప్పకుండా 18 సంవత్సరాలు పూర్తి కావాలి. అయితే వీటికి 33 సంవత్సరాలకు మించకూడదు. అదే టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు అయితే తప్పకుండా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. అయితే కొన్ని కులాల వారికి వయో సడలింపు ఉంటుంది. అయితే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవల్ 5లో జీతం రూ.29,200 ఇస్తారు. అదే టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2 అయితే రూ. 19,900 ఇస్తారు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి అప్లే చేసే వారిలో కొందరికి డబ్బులు ఉండవు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులు మినహా మిగిలిన వారికి దరఖాస్తు రుసుము రూ. 500. ఉంటుంది. ఎవరైతే దీని కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు అవుతారో వారికి బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ. 400 తిరిగి ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. ఎవరైతే దీని కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు అవుతారో వారికి బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ. 200 తిరిగి ఇస్తారు.
Also read: Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ
-
Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్
-
Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్
-
Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెలక్ట్ అయితే నెలకు లక్షకి పైగా జీతం
-
BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు