Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ

Naga Chaitanya : యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ ఇప్పుడు భార్యాభర్తలుగా హాయిగా కాపురం చేసుకుంటున్నారు. వీరు అప్పుడప్పుడు దేశ, విదేశాల్లో చక్కర్లు కొట్టడం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివారాలు సినిమాలు చూస్తారు, షికార్లు చేస్తారు, ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటారు. అయితే, మొదట్లో ఇలా ఉండేది కాదని వారే స్వయంగా చెప్పుకున్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ, “ఆమెకు రీడింగ్ అంటే చాలా ఇష్టం. నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. మా సెలవులను ప్లాన్ చేసుకోవడానికి వంతులు వేసుకుంటాం. ఒకసారి ఆమె లీడ్ తీసుకుంటే ఆ తర్వాత సారి నేను ప్లాన్ చేస్తాను” అని చెప్పాడు.
Read Also:DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్..డీకే శివకుమార్ సీఎం అవుతారా?
ఒకసారి శోభితకు రేస్ ట్రాక్‌లో కారు ఎలా డ్రైవ్ చేయాలో నేర్పిన సమయాన్ని నాగ చైతన్య గుర్తు చేసుకున్నాడు. “ఒకసారి కారు డ్రైవ్ చేయడం మొదలుపెడితే, ఆమె అస్సలు ఆపాలనుకోదు” అని అతను చెప్పాడు. తన తండ్రి, తన తల్లి (లక్ష్మీ దగ్గుబాటి), తన భార్య అంటే తనకు చాలా గౌరవమని నాగ చైతన్య పేర్కొన్నాడు.
గత నెల శోభిత ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వేవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆమె పొట్ట కాస్త ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అందరూ ఆమె గర్భవతి అని భావించారు. ఆమె తన పొట్టను దాచుకోవడానికి ప్రయత్నించినట్లు కూడా కనిపించింది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Read Also:Anant Ambani Salary: ముఖేష్ అంబానీ వారసుల్లో అనంత్ టాప్.. తన జీతం ఎంతో తెలిస్తే షాకే
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్