Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతో, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సమంత, ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 2025 ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. గత 15 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది.
తానా వేదికపై సమంత మాట్లాడుతూ, “గుడ్ ఈవినింగ్. ఈ స్టేజ్ మీద నిలబడటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండే తానా గురించి వింటూ ఉంటాను. నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ నుంచి ఇప్పటివరకు మీకు థాంక్స్ చెప్పే అవకాశం రాలేదు. నా మొదటి సినిమా నుంచే మీరు నన్ను మీ సొంతం చేసుకున్నారు.
మీరు నాకు కేవలం ప్రేమను మాత్రమే ఇచ్చారు, మీకు థాంక్స్ చెప్పడానికి ఇక్కడికి రావడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇది నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన స్టేజ్. నా మొదటి ప్రొడక్షన్ ‘శుభం’ సినిమాను నార్త్ అమెరికా ప్రజలే ఎక్కువగా అభినందించారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగు ప్రేక్షకులు నా గురించి గర్వపడతారా అని ఆలోచిస్తాను. నా కెరీర్‌లో ఏ నిర్ణయం తీసుకునే ముందు ఇదే నా మొదటి ఆలోచన.” అంటూ సమంత తన మనసులోని మాటను బయటపెట్టింది.
“మీరు నాకు ఒక గుర్తింపును, ఒక ఇంటిని, ఒక అనుబంధాన్ని ఇచ్చారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ‘ఓ బేబీ’ సినిమా మిలియన్ డాలర్లు వసూలు చేసిందని నాకు గుర్తు, నేను నమ్మలేకపోయాను. భౌగోళికంగా మీరు నాకు దూరంగా ఉన్నా, నా గుండెల్లో మీరున్నారు, మీ పట్ల నేను చాలా కృతజ్ఞురాలిని.” అంటూ సమంత భావోద్వేగానికి లోనైంది.
Read Also:Vaibhav Suryavanshi : 52బంతుల్లోనే సెంచరీ.. 13ఫోర్లు, 10 సిక్సులతో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?