Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెలక్ట్ అయితే నెలకు లక్షకి పైగా జీతం

Bank of India:
ప్రస్తుతం చాలా మంది బ్యాంకు ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఉద్యోగం కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా చదువుతున్నారు. ఈ రోజుల్లో బాగా కాంపిటేషన్ పెరిగిపోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. దీంతో ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా వెంటనే వాటికి అప్లై చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అందుకే వీటికి చాలా మంది అప్లై చేస్తుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వార ఈ ఉద్యోగాలకు ఎక్కువగా అప్లై చేస్తుంటారు. నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేస్తారు. అయితే బ్యాంకు ఉద్యోగాలు అయితే ఎక్కువ నోటిఫికేషన్స్ రావడంతో పాటు ఏడాదిలో ఎక్కువ సార్లు రిలీజ్ అవుతుంటాయి. ఈ నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగాలకు అపై చేస్తారు. అయితే మీ లక్ష్యం బ్యాంకు ఉద్యోగం అయితే ఇది మీ కోసమే. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ముంబై బ్రాంచిలోని కొన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. వీటి కోసమే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉండటంతో పాటు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆన్‌లైన్‌లో మార్చి 23వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే రూ.850 ఫీజు ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే రూ.175 ఫీజు చెల్లించాలి. బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 2025 జనవరి 1వ తేదీకి అభ్యర్థుల వయస్సు 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఓబీసీ అభ్యర్థులకు అయితే మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఇక దివ్యాంగ అభ్యర్థులకు అయితే పదేళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు ఎక్కువ వేతనమే ఉంటుంది. వీటిలో ఎంఎంజీఎస్-2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93960 జీతం ఇస్తారు. ఎంఎంజీఎస్-3 పోస్టులకు నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 జీతం ఉంటుంది. అదే ఎంఎంజీఎస్-4 ఉద్యోగాలకి అయితే రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మార్చి 23 చివరి తేదీ. ఇంట్రెస్ట్ ఉన్నవారు https://bankofindia.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
-
BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు
-
Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్
-
CUET: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ సార్ట్.. ఎలా చేసుకోవాలంటే?
-
TG: మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీలో 14236 పోస్టుల భర్తీకి టీజీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
-
CISF: 10th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు ఆరవై వేలకు పైగా జీతం