Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్

Jobs:
ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకు ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం. ఎందుకంటే కాంపిటేషన్ పెరిగిపోయింది. ఒక్క ఉద్యోగానికి వేల మంది కాదు.. లక్షల మంది పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే.. వెంటనే అప్లై చేస్తున్నారు. పరీక్షలు రాసి వారి సత్తాను చాటుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మాత్రం చదువు, మార్కులతో పాటు కేటగిరీ కూడా చూస్తుంటారు. అందులోనూ ఏ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్స్ తరచుగా వస్తుంటాయో వాటికే ప్రిపేర్ అవుతుంటారు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి.
ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. డిగ్రీ పూర్తి అయ్యి ఖాళీగా ఉన్న వారికి ఈ ఉద్యోగాలు బాగా ఉపయోగపడతాయి. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 4000 పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్ ఇవ్వనుంది. డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే బ్యాంకు ఉద్యోగాల వైపు ఆసక్తిగా ఉంటారో వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. వీటికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 4000 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఏపీకి 59, తెలంగాణకి 193 ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై వయస్సు ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సు సడలింపు ఉంటుంది. స్టైపెండ్‌ను మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.15,000, రూరల్, సెమీ అర్బన్‌లో రూ.12,000 ఇస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.800 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులుకు రూ.600 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 11. ఈ తేదీలోగా మాత్రమే ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ బ్యాంకు ఉద్యోగాలు చేస్తే దూరంగా ఎక్కడికి వెళ్లకుండా ఉండవచ్చు. గ్రామానికి దగ్గరలో ఉన్న బ్రాంచ్‌లో ఉద్యోగాలు వేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవడం మంచిది.