Banks: ఈ బ్యాంకులకు ఇకపై మినిమం బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. ఆ బ్యాంకులు ఏవంటే?

Banks: డబ్బులు దాచుకోవడానికి చాలా మందికి బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. కొందరికి ఒకటి రెండు కాకుండా కాస్త ఎక్కువగానే బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. అయితే బ్యాంకులో అకౌంట్ ఉంటే సరిపోదు.. దానికి తగ్గట్లుగా మినిమం బ్యాలెన్స్ కూడా ఉండాలి. లేకపోతే ఫైన్ వేస్తారు. కొన్ని బ్యాంకుల్లో కాస్త తక్కువగా ఉంటే.. మరికొన్ని బ్యాంకుల్లో ఎక్కువగా మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుంది. దీంతో చాలా మంది కొన్ని బ్యాంకుల అకౌంట్లను తీసుకోరు. మినిమల్ బ్యాలెన్స్ వాడలేక పూర్తి ఆ బ్యాంకుల్లో అకౌంట్లు అసలు ఓపెన్ చేయరు. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇకపై కొన్ని బ్యాంకులకు అసలు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఇంతకీ ఆ బ్యాంకులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంకు ఆఫ్ బరోడాలో ఖాతాకి ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదు. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారికంగా ప్రకటించింది. ఇకపై అన్ని సేవింగ్స్ ఖాతాలకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు. అందరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్ తీసుకోవచ్చు.
ఇండియన్ బ్యాంక్
జూలై 7వ తేదీ నుంచి ఇండియన్ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా వర్తిస్తుంది. ఈ బ్యాంకులో అకౌంట్ ఉండి మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఎలాంటి పెనాల్టీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఇకపై పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయమని తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. దీనివల్ల రైతులు, సామాన్య మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా అకౌంట్‌ను తీసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమమ్ బ్యాలెన్స చాలా ఎక్కువగా ఉండేది. దీంతో చాలా మంది అకౌంట్లను క్లోజ్ చేసేవారు. తక్కువగా అయితే చాలా మంది వాడే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా ఛార్జీలు పెంచడం వల్ల చాలా మంది వాడటం మానేసరికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా మినిమమ్ బ్యాలెన్స్‌ను తీసేసింది. దేశంలో ఎక్కువ మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు తెరిచేవారు. కానీ ఛార్జీలు ఎక్కువగా కట్ చేయడం వల్ల చాలా మంది మక్కువ చూపించడం లేదు. ఈ కారణం వల్లనే ఛార్జీలను తీసేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?
-
With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
SBI: బ్యాంకు ఉద్యోగం మీ కల.. అయితే వెంటనే అప్లై చేసుకోండి
-
Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్
-
SBI: బ్యాంకు ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త.. ఇలా చేస్తే మీ డబ్బులు గోవిందా
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.