SBI: బ్యాంకు ఉద్యోగం మీ కల.. అయితే వెంటనే అప్లై చేసుకోండి

SBI:
ఈ రోజుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం. కాంపిటేషన్ బాగా పెరిగిపోయింది. ఒక్క ఉద్యోగానికి వేల మంది కాదు.. లక్షల మంది పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే.. వెంటనే అప్లై చేస్తున్నారు. పరీక్షలు రాసి వారి సత్తాను చాటుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మాత్రం చదువు, మార్కులతో పాటు కేటగిరీ కూడా చూస్తుంటారు. అందులోనూ ఏ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్స్ తరచుగా వస్తుంటాయో వాటికే ప్రిపేర్ అవుతుంటారు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగాలు ఎప్పటికప్పడూ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి.
వీటిలో రిక్రూట్‌మెంట్ కూడా తొందరగానే పూర్తి అవుతుంది. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే వీటికి పోస్టింగ్ కూడా ఒక ఏడాదిలోనే మొత్తం పూర్తి చేస్తారు. అయితే అన్ని బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు చేయాలని చాలా మంది కలలు కంటారు. ఇది ప్రభుత్వం బ్యాంకు అని, ఉద్యోగం వస్తే ఒక్కసారి లైఫ్ సెట్ అని అనుకుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIIలో మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అభ్యర్థులను నియమిస్తోంది. వీటిలో కేవలం నాలుగు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అది కూడా కేటాయించిన వారికి మాత్రమే ఇస్తుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (PGDM) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (PGPM), మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (MMS) వంటి కోర్సులు చేసి ఉండాలి. అలాగే రిటైల్ బ్యాంకింగ్‌లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్, సూపర్ వైజరీ, మేనేజిరియల్ పాత్రలో కనీసం 5 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వయస్సు 28 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా అయితే 40 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేపడతారు. వీటికి ఎంపికైన వారికి నెలకు రూ.85920 నుంచి లక్షకు పైగా వేతనం ఇస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.750 కట్టి అప్లై చేసుకోవాలి. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 16. ఆసక్తి ఉన్నవారు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.