CISF: 10th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు ఆరవై వేలకు పైగా జీతం

CISF:
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతీ ఒక్కరూ కూడా కలలు కంటారు. వీటికోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఏ చిన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా సరే పెడుతుంటారు. అయితే ఎక్కువగా ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్‌పై ఉంటాయి. కొందరు డబ్బులు లేకపోవడం లేదా వేరే ఇతర కారణాల వల్ల పదవ తరగతితోనే చదువు ఆపేస్తారు. అలాంటి వారికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. పదవి తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే మాత్రం వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటికి అప్లై చేసి ఉద్యోగం సాధిస్తే.. అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదవ తరగతితో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అంటే ఆషామాసీ కాదు. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పకుండా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే వీరి వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సు సడలింపు కూడా ఉంటుంది. వీటికి సీబీటీ టెస్ట్, శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఇస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. అదే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితం. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఉద్యోగానికి ఆసక్తి, అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు 1161 ఉండగా.. అందులో ఖాళీలు ఇవే!
కానిస్టేబుల్ కుక్ – 493
కానిస్టేబుల్ కోబ్లర్ – 9
కానిస్టేబుల్ టైలర్ – 23
కానిస్టేబుల్ బార్బర్ – 199
కానిస్టేబుల్ వాషర్‌మ్యాన్ – 262
కానిస్టేబుల్ స్వీపర్ – 152
కానిస్టేబుల్ పెయింటర్ – 2
కానిస్టేబుల్ కార్పెంటర్ – 9
కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ – 4
కానిస్టేబుల్ గార్డెనర్ –
4 కానిస్టేబుల్ వెల్డర్ – 1
కానిస్టేబుల్ ఛార్జ్‌మ్యాన్ మెకానికల్ – 1
కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ – 2