TG: మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీలో 14236 పోస్టుల భర్తీకి టీజీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

TG:
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిని జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చూసుకోవడానికి ఈ నోటిఫికేషన్‌ను భర్తీ చేయనున్నారు. బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించేందుకు, చిన్న పిల్లలకు విద్యను అందించేందుకు అంగన్వాడీ టీచర్ పోస్టులను రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో టీచర్లు, హెల్పర్లు ఉన్నారు. వీటిలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. వయస్సు పెరగడం వల్ల రిటైర్ కావడం, కొందరు రాజీనామా చేయడం, సూపర్ వైజర్లుగా కొందరు ప్రమోషన్ పొందడం ఇలా మొత్తం 3,914 మంది ఉన్నారు. వీటిని ప్రభుత్వం భర్తీ చేయనుంది.
అంగన్వాడీ టీచర్ పోస్టులకు గతంలో పదో తరగతి అర్హత ఉండాలి. కానీ ఇప్పుడు కనీసం ఇంటర్ అయినా పాస్ అయి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అప్పుడే ఈ పోస్టులకు అర్హత సాధిస్తారు. అయితే అంగన్వాడీ పోస్టుల్లో టీచర్లతో పాటు హెల్పర్లకు కూడా 50 శాతం కేటాయిస్తున్నారు. అంటే హెల్పర్లగా పనిచేసే వారు టీచర్లుగా ప్రమోషన్ పొందాలి. కానీ కొందరికి విద్యార్హతలు లేకపోవడం వల్ల భర్తీ చేయనుంది. అయితే రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయ్యి 567 హెల్పర్లు మాత్రమే ఉన్నారు. వీరికి మాత్రమే అంగన్వాడీ టీచర్లలో పదోన్నతలు లభిస్తాయి. అంగన్‌వాడీలో మొత్తం 14236 ఖాళీల ఉన్నాయి. అందులో అంగన్వాడీ టీచర్లు 1,918 ఖాళీలు ఉండగా.. అంగన్వాడీ హెల్పర్లు 7,837, రిటైర్మెంట్ చేయనున్నవారు 3,914, టీచర్లుగా ప్రమోట్ అయ్యే హెల్పర్లు 567 ఉన్నారు.
-
Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
-
Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెలక్ట్ అయితే నెలకు లక్షకి పైగా జీతం
-
BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు
-
Alzheimer’s: భయపెట్టిస్తున్న అల్జీమర్స్.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ.. కారణమేంటి?
-
Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.69 వేల జీతం
-
CISF: 10th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు ఆరవై వేలకు పైగా జీతం