With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?

With out pay slips personal Loan: ఎంత జీతం ఉన్నా కూడా అప్పు చేయకుండా ఏ వ్యక్తి ఉండడు. ఏదో ఒక అవసరానికి అప్పు చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత విషయాలు, పెళ్లి, పిల్లల చదువు ఇలా ఏదో ఒక సమయంలో లోన్ తీసుకుంటారు. అయితే ఇలాంటి అర్జంట్ సమయాల్లో అప్పుడు ఎవరూ కూడా ఇవ్వకపోతే కొందరు లోన్లు పెడుతుంటారు. ఈ లోన్లు కావాలన్నా కూడా కొన్ని రూల్స్ పాటించాలి. అయితే జాబ్స్ చేసే కొందరికి పే స్లిప్‌లు ఉంటాయి. మరికొందరికి పే స్లిప్‌లు ఉండవు. ఇలా పే స్లిప్‌లు లేని వారికి అసలు బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఎందుకంటే ఏ నమ్మకంతో ఇవ్వాలనే ఉద్దేశంతో లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. అయితే పే స్లిప్‌లు లేకుండా బ్యాంకుల్లో రుణం పొందవచ్చా? లేదా? ఒకవేళ రుణం ఇస్తే ఎలా ఇస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మందికి శాలరీ స్లిప్‌లు ఉండవు. అలాంటి వారు బ్యాంకు స్టేట్‌మెంట్‌లను చూపించి లోన్ తీసుకోవచ్చు. దీనికి బ్యాంకు వారు కనీసం 6 లేదా 12 నెలల స్టేట్‌మెంట్ అడుగుతారు. వాటిని మీరు చూపించి కూడా లోన్ తీసుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ అయినా కూడా చూపించవచ్చు. అయితే మూడేళ్ల నుంచి ఆదాయపు పన్ను దాఖలు చేసిన డిటైల్స్ ఉంటే చూపిస్తే లోన్ వస్తుంది. వీటితో పాటు ఫారం 16 లేదా ఎంప్లాయ్‌మెంట్ లెటర్ అయినా చూపించవచ్చు. ప్రతీ ఉద్యోగికి తప్పకుండా ఫారం 16 ఇస్తారు. లేకపోతే ఉద్యోగ ధృవీకరణ పత్రాలు ఉంటాయి. వీటిని చూపిస్తే బ్యాంకు వారు లోన్ ఇస్తారు. అంటే వారి జీతం అన్నింటిని చెక్ చేసుకున్న తర్వాత లోన్ ఇస్తారు. అలాగే వ్యాపారం చేసుకునే వారు అయితే GST రిటర్న్‌లు, వ్యాపార రిజిస్ట్రేషన్, బడ్జెట్, లాభాలు చూపిస్తే బ్యాంకు వారు లోన్ ఇస్తారు. అయితే శాలరీ స్లిప్ లేకుండా లోన్ అనేది కాస్త కష్టతరమే. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే బ్యాంకు వారు తప్పకుండా లోన్ ఇస్తారు.
బ్యాంకులో లోన్ తీసుకునే వారు క్రెడిట్ స్కోర్‌ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు వారు అసలు లోన్ మంజూరు చేయరు. క్రెడిట్ స్కోర్ కనీసం 700 కంటే ఎక్కువగా ఉంటేనే లోన్ వస్తుంది. లేకపోతే లోన్ ఇవ్వరు. సరిగ్గా లోన్ కట్టకపోతే దీన్ని కూడా కట్టలేరు ఏమోనని ఇవ్వరు. అదే క్రెడిట్ స్కోర్ సరిగ్గా ఉంటే పే స్లిప్‌లు లేకపోయినా కూడా బ్యాంకులో లోన్ ఇస్తారు. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లు అన్ని కూడా చెక్ చేసుకుని మీకు బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఏ విధంగా అయినా ఎప్పుడైనా లోన్ కావాలంటే మాత్రం ఇప్పటి నుంచే క్రెడిట్ స్కోర్‌ను బ్యాలెన్స్ చేయండి.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్
-
Banks: ఈ బ్యాంకులకు ఇకపై మినిమం బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. ఆ బ్యాంకులు ఏవంటే?
-
Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?
-
First Time Home Loan: ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. వీటిని మరిచిపోవద్దు
-
Personal Loans: సున్నా వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తారా?
-
Personal Loan : వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకపోతే భారీగా నష్టపోతారు..
-
Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. మీకు లోన్ వస్తుందో తెలుసా?