CUET: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ సార్ట్.. ఎలా చేసుకోవాలంటే?

CUET:
ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత విశ్వ విద్యాలయాల్లో ప్రవేశానికి రెడీ అవుతున్న విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ యూజీ 2025 పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఇంటర్ తర్వాత మంచి యూనివర్సిటీలో చదవాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. అయితే దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవాలంటే మాత్రం సీయూఈటీ అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ చదివిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వ విద్యాలయాలలో ప్రవేశానికి తప్పకుండా ఈ సీయూఈటీ పరీక్ష అనేది రాయాలి. అయితే ఈ సీయూఈటీ యూజీకి దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీన ప్రారంభమైంది. దీనికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోండి. అయితే ఈ సీయూఈటీకి అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ మార్చి 22 వరకు ఉంది. అయితే మార్చి 22వ తేదీ వరకు పరీక్ష రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 23 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవాలి. దరఖాస్తు చేసినప్పుడు ఏదైనా తప్పు చేస్తే వాటిని మార్చి 24వ తేదీలోగా మార్చుకోవచ్చు. దీన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్ష మోడల్‌లో నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులు గరిష్టంగా 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు రాయగలరు.
ఈ సీయూఈటీ యూజీ పరీక్షలు మొత్తం 13 భాషల్లో 23 సబ్జెక్టుల్లో జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలో విద్యార్థులు భాషలో, స్పెషలైజేషన్ సబ్జెక్టు, జనరల్ ఆప్టిట్యూడ్ వంటి వాటిలో వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలను మే 8వ తేదీ నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. అయితే ఈ సీయూఈటీ యూజీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారు కొన్ని పత్రాలను సమర్పించాలి. ముఖ్యంగామ 10, 12వ తరగతి మార్కుల షీట్, అలాగే జనన ధృవీకరణ పత్రం, స్కాన్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీ, పీడీఎఫ్ ఫార్మాట్‌లో కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే), ఫీజు చెల్లించడానికి బ్యాంకు ఖాతా వివరాలు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఉంటేనే అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది. అప్లై చేసుకునే డేట్ లాస్ట్ అయితే సర్వర్ బిజీ వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ పరీక్షలకు అప్లై చేయాలనుకుంటే ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. లేకపోతే మళ్లీ ఆలస్యం అవుతుంది.