Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Akhanda 2 Helicopter Shot Viral Mems In Social Media

Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్

Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్
  • Edited By: kusuma,
  • Updated on June 10, 2025 / 04:29 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Akhanda 2 Helicopter Shot: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ‘అఖండ 2’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో బాలయ్య తన శూలంతో శత్రువులను చంపే విధానం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన శూలాన్ని హెలికాప్టర్ తిరిగినట్లు తిప్పుతూ పోరాడే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ‘హెలికాప్టర్ షాట్’తో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ధోనీ హెలికాప్టర్ షాట్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 టీజర్‌లోని బాలయ్య హెలికాప్టర్ ఫైట్‌ను ధోనీ షాట్‌తో పోలుస్తూ ‘మీరు మహేంద్ర సింగ్ ధోనీ హెలికాప్టర్ షాట్ చూసి ఉంటారు.. ఇది బాలయ్య బాబు హెలికాప్టర్ షాట్.. బోత్ ఆర్ నాట్ సేమ్ (Both Are Not Same)’ అనే మీమ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మీమ్స్ ప్రజలను ఆకట్టుకుంటుంది.

ఇదెలా ఉండగా ఈ అఖండ 2 సినిమాపై మొదటి నుంచే హైప్ ఉంది. టీజర్‌తో సినిమాలపై అంచనాలు ఇంకా పెరిగాయి. డ్యుయల్ రోల్‌లో బాలయ్య బాబు యాక్టింగ్, బీజీఎం ఇంకా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండకి సీక్వెల్‌‌గా వస్తున్న ఈ మూవీ టీజర్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. బాలయ్య బాబు అయితే ఊర మాస్ లుక్‌లో కోపంతో అదిరిపోయాడు. బాలయ్య నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అదే టీజర్‌లో కనిపిస్తోంది. అయితే అఖండ మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో సీక్వెల్‌గా పార్ట్-2ను తీస్తున్నారు. టీజర్‌లో డైలాగ్‌లు కూడా అదిరిపోయాయి. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కూడ కన్నెతి చూడడు.. నువ్వు చూస్తావా? ‘అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌లు టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఇవి ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా మూవీ టీం చెప్పిన సమయానికే టీజర్‌ను విడుదల చేసింది. ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే ఉంది. ఈ మూవీని ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం

Tag

  • Akhanda 2
  • Balakrishna Teaser
  • Helicopter Shot
  • Latest
  • Social media
Related News
  • Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?

  • Balakrishna Birthday : అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో.. అత్యధిక డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్‌తో రికార్డులు!

  • Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో

  • Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..

  • Viral : ముంబైలో వానల బీభత్సం.. నవ్వులు పూయిస్తున్న బాహుబలి మీమ్

  • Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us