Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు

Indian Air Force Agniveer Recruitment 2025: చాలా మందికి దేశ సైనిక వ్యవస్థలో పనిచేయాలని ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి వాటిలో జాయిన్ అవుతారు. వీటి కోసం చిన్నతనం నుంచే ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. అయితే వీటికి చిన్న వయస్సు వారిని ఎంపిక చేస్తారు. ఇంటర్ చదివిన వారిని ఈ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్‌లో మంచి మార్కులతో ఉద్యోగం సంపాదించిన వారికి ఈ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే ఇంటర్ తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి రిక్రూట్‌మెంట్‌ను రిలీజ్ చేసింది. ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నవారు ఎవరైనా కూడా ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో అగ్నివీర్ వాయుకి పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే ఇంటర్‌లో తప్పకుండా సైన్స్ గ్రూప్ ఉండాలి. ఎవరైనా విద్యార్థులు ఇంటర్‌లో గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉంటే వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీరే కాకుండా ఐటీఐ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లమో చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లం చదివిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వరకు మాత్రమే ఉండాలి. వీటికి రిక్రూట్‌మెంట్ కూడా కాస్త కఠినంగా ఉంటుంది. వీటికి రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే రాత పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు కూడా రూ.550 చెల్లించాలి. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ జూలై 11న ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసిన వారు తొందరగా ఉద్యోగాలు సంపాదించడానికి వీటిని ట్రై చేస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు కాస్త ఎత్తు ఉండాలి. అలాగే ఫిట్‌గా కూడా ఉండాలి. వీటిని బట్టి ఎంపిక చేస్తారు. తక్కువ ఎత్తు ఉన్నవారిని అయితే అసలు ఎంపిక చేయరు. అలాగే రాత పరీక్ష కూడా సరిగ్గా కూడా రాస్తేనే ఎంపిక అవుతారు.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్
-
Jobs : ఇంజనీర్లకు గుడ్ న్యూస్.. రూ.25వేల స్టైఫండ్ తో ప్రసార భారతిలో 421 ఉద్యోగాలు