Strange Discovery: తవ్వకాల్లో బయటపడ్డ వింత… కూర్చున్న భంగిమలో 1000ఏళ్ల నాటి సమాధి బాబా
భారతదేశ చరిత్ర గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుజరాత్లో 1000 సంవత్సరాల నాటి ఒక అస్థిపంజరం బయటపడటం పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదు గంటల పాటు శ్రమించి 15 మంది నిపుణుల పర్యవేక్షణలో ఈ అస్థిపంజరాన్ని వడ్నగర్ మ్యూజియానికి తరలించారు.

Strange Discovery: భారతదేశ చరిత్ర గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుజరాత్లో 1000 సంవత్సరాల నాటి ఒక అస్థిపంజరం బయటపడటం పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదు గంటల పాటు శ్రమించి 15 మంది నిపుణుల పర్యవేక్షణలో ఈ అస్థిపంజరాన్ని వడ్నగర్ మ్యూజియానికి తరలించారు. దీనిని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ‘సమాధి వాలే బాబాజీ’ అని పిలువబడే ఈ అస్థిపంజరం వెనుక దాగి ఉన్న కథ ఏమిటో తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఈ అస్థిపంజరాన్ని 2019లో మెహసానా జిల్లాలో జరిపిన తవ్వకాల్లో వెలికితీశారు. అప్పటి నుంచి దీనిని ఒక తాత్కాలిక గుడారంలో భద్రపరిచారు. ఇప్పుడు ఈ చారిత్రక అవశేషానికి శాశ్వత నివాసం లభించింది. వడ్నగర్ మ్యూజియం క్యూరేటర్ మహిందర్ సింగ్ సురేలా మాట్లాడుతూ.. అస్థిపంజరాన్ని గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యూజియానికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం దీనిని ప్రదర్శనకు ఉంచలేదు. భద్రతా చర్యలతో రిసెప్షన్ ప్రాంతం సమీపంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచారు. సూచనలు అందిన వెంటనే అస్థిపంజరాన్ని పరిశీలించిన తర్వాత మ్యూజియం గ్యాలరీకి తరలించేందుకు రెడీ అవుతున్నారు.
Read Also: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
2023 నుండి ఈ అస్థిపంజరాన్ని వడ్నగర్లోని పాత పట్టణం వెలుపల ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని బహిరంగ ప్రదేశంలో 12×15 అడుగుల టార్పాలిన్, గుడ్డ గుడారంలో ఉంచారు. అంతకు ముందు దీనిని గృహ సముదాయంలోని మెట్ల కింద కారిడార్‌లో ఉంచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్థిపంజరాన్ని గుడారం నుంచి బయటకు తీయడానికి క్రేన్‌ను ఉపయోగించారు. పురావస్తు తవ్వకాల్లో పనిచేసే 15 మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో దీనిని ఒక ట్రైలర్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు ఐదు గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో రైల్వే లైన్ దాటిన తర్వాత ఉన్న ధాన్యం గోడౌన్‌కు ఆనుకుని ఉన్న బంజరు భూమిలో ఈ అస్థిపంజరాన్ని తవ్వి తీశారు.
గుజరాత్ రాష్ట్రాధికారి ఒకరు మాట్లాడుతూ.. లోథాల్ మ్యూజియంలో కూడా అస్థిపంజరాన్ని ఉంచే ఆలోచన ఉందని తెలిపారు. వడ్నగర్ తవ్వకాల్లో పాల్లొన్న వడోదర సర్కిల్ మాజీ సూపరింటెండెంట్ పురావస్తు శాస్త్రవేత్త అభిజిత్ అంబేకర్ మాట్లాడుతూ.. గత అనేక సంవత్సరాలలో కనుగొనబడిన 9,000 కంటే ఎక్కువ పురాతన వస్తువులతో పాటు ఈ అస్థిపంజరాన్ని గుజరాత్ ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. ఈ అస్థిపంజరం ‘సమాధి’ స్థితిలో ఖననం చేయబడిన వ్యక్తికి చెందినది. ఆ సమయంలో ‘గుజరాత్‌లోని అన్ని మతాలలో’ ఈ ఆచారం ఉండేదని వారు భావిస్తున్నారు.