Cricket League Viral Video: ఇదెక్కడి క్యాచ్ రా మావా.. ఎప్పుడూ చూడలే.. ఇలా కూడా పడతారా.. వీడియో వైరల్
Cricket League Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో వింతగా ఉన్న వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.

Cricket League Viral Video: ప్రపంచప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు ఫుట్ బాల్ కు ఆదరణ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని క్రికెట్ ఆక్రమిస్తున్నది. క్రికెట్ కు విపరీతమైన ఆదరణ లభించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా రకరకాల ప్రయోగాలకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగానే ఫుట్ బాల్ కు విపరీతమైన ఆదరణ ఉన్న దేశాలలో అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నది. తద్వారా ఆయా దేశాలలో క్రికెట్ కు ఆదరణ పెరగడానికి కృషి చేస్తున్నది.. అంతర్జాతీయ క్రికెట్ మండలి చేస్తున్న ప్రయోగాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన టోర్నీల ద్వారా ఆయా దేశాలలో యువకులు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. పైగా ఆయా దేశాలలో అంతర్జాతీయ క్రికెట్ మండలి జట్లను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నది.
ఇక మనదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం సమయం దొరికినా చాలు యువకులు క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఒక బ్యాట్, బంతి, ఆరు వికెట్లు ఉంటే చాలు క్రికెట్ ఆడేస్తున్నారు. ఇక ఐపీఎల్ ను స్ఫూర్తిగా తీసుకొని దేశీయ స్థాయిలో కూడా టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపి చాలామంది ప్లేయర్లు జాతీయ జట్టులో అవకాశాలను పొందుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తున్నది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ప్రాంతంలో క్రికెట్ లీగ్ నడుస్తోంది. కాకపోతే టెన్నిస్ బంతితో ఆ లీగ్ నిర్వహిస్తున్నారు. ఆడుతున్న వారంతా మధ్య వయసు ఉన్నవారే. అందువల్లే టెన్నిస్ బంతితో ఆడుతున్నారు. మ్యాచ్లో భాగంగా బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ కొట్టాడు. కాకపోతే ఆ బంతి బ్యాట్ చివరి అంచుకు తగిలి కీపర్ చేతులో పడింది. అయితే దానిని అందుకునే క్రమంలో కీపర్ కింద పడ్డాడు. బంతి కూడా చేతి నుంచి జారిపోయి అతని వీపు భాగంలో పడింది. అంతే అతడు అమాంతం ఆ బంతిని తన వీపు మీద పెట్టుకొని.. చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో అంపైర్ అవుట్ ఇవ్వక తప్పలేదు.. వాస్తవానికి క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లను ఫీల్డర్లు అందుకుంటారు. కానీ ఈ బంతిని మాత్రం కీపర్ అందుకున్న తీరు ఆశ్చర్యానికే ఆశ్చర్యం కలిగించే విధంగా మారింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పడటంతో.. లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్యాచ్ మేము ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి క్యాచ్ లు మ్యాచ్ స్వరూపాలను పూర్తిగా మార్చేస్తాయని వారు పేర్కొంటున్నారు.
Literally caught behind! 😂 pic.twitter.com/RemAiDkhkz
— Out Of Context Cricket (@GemsOfCricket) June 16, 2025
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు