CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
పెళ్లి అనే అద్భుతమైన బంధంలో హ్యాపీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే మానసికంగా ఇబ్బంది పడతారు. కొందరు పెళ్లి చేసుకున్న ఏడాదికే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు.

CIBIL Score:పెళ్లి అనే అద్భుతమైన బంధంలో హ్యాపీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే మానసికంగా ఇబ్బంది పడతారు. కొందరు పెళ్లి చేసుకున్న ఏడాదికే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. నిజానికి ఒకప్పుడు పెళ్లి విలువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పెళ్లి అనేది కొందరికి బొమ్మలాట అయిపోయింది. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చేసుకుంటున్నారు.. అక్కడికి ఏడాదికే విడిపోతున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని లక్షలు ఖర్చు పెట్టి మరి పెళ్లి చేస్తున్నారు. కానీ పెళ్లికి కాస్త గౌరవం ఇవ్వకుండా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. అయితే వీటికి ముఖ్య కారణం పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోకపోవడమే. అయితే ఈ మధ్య కాలంలో సిబిల్ స్కోర్ వల్ల పెళ్లిళ్లు ఆగిపోవడం, విడాకులు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అసలు పెళ్లికి, సిబిల్ స్కోర్‌కి సంబంధం ఏంటి? పెళ్లికి ముందు తప్పకుండా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే
అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లికి ముందు తప్పకుండా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దాంపత్య జీవితంలో ఫైనాన్షియల్ కూడా చాలా ముఖ్యమైనది. ఆర్థికపరమైన సమస్యలు రాకుండా సంతోషంగా ఉండాలంటే ముందుగానే చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది అప్పులు తీసుకుని కట్టడం లేదు. ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అన్ని తీసుకుంటున్నారు. అన్నింట్లో కూడా లోన్‌లు తీసుకుని.. అప్పుల పాలు అవుతున్నారు. వీటివల్ల పెళ్లి అయిన తర్వాత ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. దీంతో గొడవలు వచ్చి చివరకు అది విడాకులకు దారి తీస్తుంది. అలాగే పెళ్లి అయిన తర్వాత భవిష్యత్తులో మంచి పొజిషన్‌లో ఉండాలన్నా కూడా తప్పకుండా సిబిల్ స్కోర్ చూసుకోవాలి.
Read Also: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే
వివాహ బంధంలో ప్రేమ, నమ్మకం, అండర్‌స్టాండింగ్ అన్ని ఎంత ముఖ్యమూ.. ఈ రోజుల్లో సిబిల్ స్కోర్ కూడా ముఖ్యమే. ఎందుకంటే అన్ని విధాలుగా పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉండాలని భావిస్తారు. కానీ ఇలా అప్పులు, ఆందోళనతో జీవితాన్ని గడపాలని అనుకోరు. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకోండి. లేకపోతే పెళ్లి అయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇటీవల సిబిల్ స్కోర్ చూసి ఓ అమ్మాయి పెళ్లిని క్యాన్సిల్ చేయించుకుంది. అయితే కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు తప్పు పట్టారు. నిజానికి దాంపత్య జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. కానీ అధికంగా ఉంటే మాత్రం కష్టం. కాబట్టి మీరు తప్పకుండా పెళ్లి చేసుకునే ముందు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి.
-
Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!
-
Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
-
Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట