Credit Card: క్రెడిట్ కార్డు బిల్‌ను ఈఎంఐగా మార్చితే.. ఏమవుతుందో మీకు తెలుసా?

Credit Card:
ప్రస్తుతం రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతీ చిన్న వస్తువు కొనడానికి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. గతంలో విదేశీయులు ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఇండియన్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఒక్కోక్కరికి ఒక్కో క్రెడిట్ కాకుండా చాలా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అవసరానికి డబ్బులు లేకపోతే చాలా మంది ఇలా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. తీసుకున్న అప్పు కూడా సరైన సమయానికి కట్టడం లేదు. దీంతో సిబిల్ స్కోర్ కూడా భారీగానే తగ్గుతుంది. అయితే క్రెడిట్ కార్డు బిల్లును నెలా నెలా కట్టడానికి కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఈఎంఐ పెట్టుకుంటే ఎలా ఉంటుందని భావిస్తారు.
అయితే ఇలా పెద్ద మొత్తంలో కట్టడం కంటే.. ఈఎంఐ పెట్టుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో చాలా మంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు. వీటికి కొన్ని కంపెనీలు కూడా వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను EMIలుగా మార్చుకోవచ్చు. వీటికి కొన్ని కంపెనీలు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. ఇలా క్రెడిట్ కార్డు బిల్లులను ఒకేసారి కాకుండా ఈఎంఐలో కట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కానీ కాస్త వడ్డీ కూడా కంపెనీలు ఎక్కువగానే వేస్తాయి. వీటితో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది. అయితే ఇలా మార్చుకోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. కానీ సిబిల్ స్కోర్ తగ్గదు. మీరు ఈఎంఐ చెల్లించే బట్టే స్కోర్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐగా మార్చడం వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా బ్యాంకులకు క్రెడిట్ కార్డు ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అందులో వారు పదే పదే కాల్ చేసి మరి క్రెడిట్ కార్డులను ఇస్తుంటారు. కస్టమర్లు ఎంత ఎక్కువ మంది ఉండి, ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. బ్యాంకులకు అంత లాభమంట. అందుకే కాల్ చేసి మరి బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ఒక వ్యక్తి ఒక క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత వాటికి ఛార్జీలు, వడ్డీలు, కార్డ్ కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్లీ ఛార్జీలు తీసుకోవడం ఇలా ప్రతీ విషయంలో కూడా బ్యాంకు వాళ్లు డబ్బులు లాక్కుంటారు. వీటివల్ల బ్యాంకు వాళ్లకు భారీగా డబ్బులు వస్తాయి. ఎవరైనా క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత డబ్బులు సరైన సమయంలో చెల్లించకపోతే మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఇలా చూసుకుంటూ పోతే.. ఒక్కో క్రెడిట్ కార్డు మీద చాలా లాభాలు ఉన్నాయి. అందుకే బ్యాంకు వాళ్లు కాల్ చేసి మరి క్రెడిట్ కార్డులు ఇస్తుంటారు. మళ్లీ కొన్నిసార్లు వీటిపై ఆఫర్లు కూడా పెడతారు. దీంతో ఏదైనా కొనుగోలు చేస్తే తక్కువకే వస్తాయని అంటారు. దీంతో కొందరు ఆకర్షితమై అవసరం లేకపోయినా కూడా కొన్ని వస్తువులు కొనేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రెడిట్ కార్డులు భారీగానే పెరిగాయి.