Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?
Credit Card: ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. డబ్బులు ఆదా చేయడానికి ఈ క్రెడిట్ కార్డును వాడుతున్నారు. నిజానికి అందరూ డబ్బులు ఆదా అనుకుంటారు.

Credit Card: ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. డబ్బులు ఆదా చేయడానికి ఈ క్రెడిట్ కార్డును వాడుతున్నారు. నిజానికి అందరూ డబ్బులు ఆదా అనుకుంటారు. కానీ ఇందులో అప్పు తీసుకున్న తర్వాత ఈ బిల్లులు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం చాలా మంది రోజూ వారీ ఖర్చులు కూడా ఈ క్రెడిట్ కార్డు ద్వారానే కడుతున్నారు. దీనివల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు క్రెడిట్ కార్డును వాడలేక వదిలేస్తారు. ఇది చివరకు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లిపోతుంది. అసలు క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్తే.. యాక్టివేట్ చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు క్రెడిట్ కార్డులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. మరికొందరు ఈ క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తక్కువగా క్రెడిట్ కార్డు వాడే వారికి అనుకోకుండా ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఇలా ఇన్‌యాక్టివ్ అయితే కొందరు వెంటనే యాక్టివేట్ చేసుకుంటారు. మరికొందరు దీన్ని తెలియక వదిలేస్తారు. ఇది సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని అలా వదిలేయకూడదు. ఏదైనా ఒక క్రెడిట్ కార్డు ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఇన్ యాక్టివేట్ అయితే మాత్రం వెంటనే యాక్టివేట్ చేసుకోవాలి. అయితే మీరు దీని కోసం క్రెడిట్ కార్డు ఉన్న బ్యాంకుు సంప్రదించాలి. మెయిన్ బ్రాంచ్ లేదా సమీపంలోని బ్రాంచ్ కి అయినా కూడా వెళ్లాలి. అక్కడికి వెళ్లి మీరు KYC చేసుకుంటే.. వారు మీ క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది అప్పుల కోసం వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అవసరం వచ్చిన ప్రతీసారి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టలేకపోతున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరైన సమయానికి క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టలేకపోతే వడ్డీ ఎక్కువ పడుతుంది. రూపాయి కట్టాల్సిన ప్లేస్‌లో రెండు రూపాయిల కంటే ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసిన కూడా చాలా మంది ఎక్కువగా క్రెడిట్ కార్డులోనే లోన్‌లు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒకోక్కరు ఒకటి కాదు.. రెండు అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. వీటివల్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతీ నెలా కూడా వడ్డీ ఎక్కువగా కడుతున్నారు. అప్పుల వల్ల ఆందోళన ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆదాయానికి మించి ఎక్కువగా అప్పులు చేయవద్దు. చేసిన అప్పులు ఎక్కువ రోజులు తీర్చకుండా ఉండవద్దు. వెంటనే అప్పులను తీర్చేయడం అలవాటు చేసుకోండి.
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Credit Card: క్రెడిట్ కార్డు బిల్‌ను ఈఎంఐగా మార్చితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!