Credit Card: లిమిట్కి మించి క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా కూడా తప్పకుండా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. దేశంలో కూడా ప్రస్తుతం క్రెడిట్ కార్డు వారి సంఖ్య బాగా పెరిగింది. ఒకరి దగ్గర మూడు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయి.

Credit Card: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా కూడా తప్పకుండా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. దేశంలో కూడా ప్రస్తుతం క్రెడిట్ కార్డు వారి సంఖ్య బాగా పెరిగింది. ఒకరి దగ్గర మూడు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. బయటకు వెళ్తే డబ్బులు లిమిట్ అయిపోయినా కూడా షాపింగ్, సినిమా ఇలా అన్నింటికి కూడా ఈ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు అయితే క్రెడిట్ కార్డును లిమిట్కి మించి ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ లిమిట్‌గా క్రెడిట్ కార్డును వాడటం వల్ల అదనపు ఛార్జీలతో పాటు వడ్డీ కూడా పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్ కార్డు స్కో్ర్ పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఓవర్ లిమిట్లో క్రెడిట్ కార్డు వాడకూడదా? ఇలా వాడటం వల్ల వచ్చే నష్టాలేంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Also: బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే మంచిదో తెలుసా?
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డుకు లక్ష రూపాయలు లిమిట్ ఉందని అనుకోండి.. మీరు ఆ లక్ష లోపల డబ్బులు మాత్రమే వాడాలి. అంత కంటే ఎక్కువగా వాడితే.. మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో బ్యాంకు ఒక్కోలా ఈ ఓవర్ లిమిట్కి వడ్డీ కట్టించుకుంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ అయితే 2.5 శాతం వడ్డీ తీసుకుంటుంది. అదే యాక్సిస్ బ్యాంక్ అయితే 2 నుంచి 3 శాతం వరకు ఛార్జీలను వసూలు చేస్తుంది. సాధారణంగా ఓవర్ లిమిట్‌పై బ్యాంకులు నెలకు 3% నుంచి 3.75% వరకు వడ్డీలు తీసుకుంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకునే ముందు తప్పకుండా ఆలోచించాలి. అందులోనూ ఓవర్ లిమిట్ వాడితే మాత్రం తప్పకుండా అది క్రెడిట్ స్కో్ర్ మీద ప్రభావం చూపుతుంది. మీకు క్రెడిట్ కార్డు పరిమితి తక్కువగా ఉందని అనుకుంటే.. వెంటనే దాని పరిమితిని పెంచమని చెప్పండి. దీనివల్ల మీకు పెద్దగా రుణభారం అనిపించదు. లేకపోతే మీరు లిమిట్ కంటే ఎక్కువగా వాడుతారు. దీనివల్ల వడ్డీ పెరిగి టెన్షన్ మొదలవుతుంది.
క్రెడిట్ కార్డులను లిమిట్లో మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువగా వాడితే అప్పులు పెరిగిపోతాయి. చాలా మంది క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు. తర్వాత వాటిని కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవసరానికి అప్పు ఉండాలి. కానీ సంపాదించే దాని కంటే ఎక్కువగా అప్పు ఉండకూడదు. ఏదైనా కూడా లిమిట్లో వాడటమే మంచిది. క్రెడిట్ కార్డులు అవసరానికి ఉపయోగపడతాయి. కానీ ఆ డబ్బులు సరైన సమయానికి కట్టకపోతే మాత్రం వడ్డీ పెరుగుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం.
-
Tata Nano: అసంపూర్ణంగా రతన్ టాటా కోరిక.. తన డ్రీమ్ కారుతో ఆయన చేయాలనుకున్న పని ఇదే!
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!