Tata Nano: అసంపూర్ణంగా రతన్ టాటా కోరిక.. తన డ్రీమ్ కారుతో ఆయన చేయాలనుకున్న పని ఇదే!
Tata Nano: రతన్ టాటాకు తన డ్రీమ్ కార్ అయిన టాటా నానో అంటే చాలా ఇష్టం. భవిష్యత్ కారుగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరుకున్నారు.

Tata Nano: ‘టాటా’ను ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన లేకపోయిన తన దూరదృష్టితో పుట్టిన ఎన్నో కంపెనీలు ప్రస్తుతం ప్రజల జీవితాల్లో భాగంగా మారాయి. అవి టీసీఎస్ (TCS) లాంటి పెద్ద గ్లోబల్ కంపెనీ అయినా, ట్రక్కులు తయారు చేసే టాటా మోటార్స్ అయినా, లేదా సామాన్యుడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని టాటా నానో (Tata Nano) లాంటి కలల కారు ఆయన నుంచి వచ్చినవే. అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ రతన్ టాటాకు ఒక కల మాత్రం తీరకుండానే ఉండిపోయింది.
రతన్ టాటాకు తన డ్రీమ్ కార్ అయిన టాటా నానో అంటే చాలా ఇష్టం. భవిష్యత్ కారుగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరుకున్నారు. తన జీవితపు చివరి రోజుల్లో కూడా రతన్ టాటా తరచుగా ఈ కారులోనే తిరిగేవారు. ఆయన కోరుకుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (ఇది కూడా టాటా గ్రూప్ కంపెనీనే) కారులో హాయిగా తిరగగలరు. కానీ, చివరి దశలో కూడా ఆయన నానోను ఫ్యూచర్ కార్‌గా మార్చే ప్రాజెక్ట్‌పై పని చేస్తూనే ఉన్నారు.
రతన్ టాటా దృష్టిలో నానో ఒక అద్భుతమైన కమ్యూటర్ వెహికల్ (చిన్నపాటి ప్రయాణాలకు అనువైన వాహనం). అందుకే, భవిష్యత్ ప్రపంచం కోసం ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా (EV) మార్చాలని చూస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాలపైనే నడుస్తుందని టాటా కూడా బలంగా నమ్మారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు ‘నియో ఈవీ’ (Neo EV) అని పేరు పెట్టారు.
Also Read: Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
టాటా నానోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ప్రాజెక్ట్‌ను రతన్ టాటా 2015లో ప్రారంభించారు. దీన్ని రెండు రకాలుగా తీసుకురావాలని ఆయన అనుకున్నారు. ఒకటి ‘సిటీ టూర్ రేంజ్’ అంటే తక్కువ బ్యాటరీ ప్యాక్‌తో, రెండవది ‘లాంగ్ రూట్ వేరియంట్’ అంటే ఎక్కువ దూరం వెళ్లే ఎలక్ట్రిక్ కారు. రతన్ టాటా ఇందుకోసం కోయంబత్తూరులోని ఒక స్టార్టప్ కంపెనీతో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్‌తో కూడా ముడిపడి ఉంది.
రతన్ టాటా మరణించినప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఒక సంఘటనను పంచుకున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. 2015లో రతన్ టాటా తనను కలిసి, తన కంపెనీలో పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఆయనకు కూడా చాలా ఆసక్తి ఉండేదట. 2017లో ఒకసారి రతన్ టాటా తనకు ఫోన్ చేసి ముంబైకి రమ్మన్నారట. తర్వాత తన విమానంలో ఆయనను కోయంబత్తూరుకు తీసుకెళ్లారట.
Also Read: Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
రతన్ టాటా తనను ముంబైకి రమ్మని, అక్కడి నుంచి కొత్త చోటికి తీసుకెళ్లాలనుకుంటున్నానని మాత్రమే చెప్పారని భవిష్ అగర్వాల్ తెలిపారు. కోయంబత్తూరులో టాటా నానోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ఆయన వ్యక్తిగత ప్రాజెక్ట్‌పై పని జరుగుతోంది. నిజానికి ‘ఓలా ఎలక్ట్రిక్’ ఆ రోజు నుంచే మొదలైందని భవిష్ అగర్వాల్ అన్నారు. రతన్ టాటా ముందు చూపు ఎంత గొప్పదో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.
-
Credit Card: లిమిట్‌కి మించి క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్
-
Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
-
Archana Jadav: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అర్చనా జాదవ్‌పై నాలుగేళ్లు నిషేధం.. కారణమిదే!