Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ తర్వాత వరుసగా కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు టీమిండియా కెప్టెన్ ఎవరనే డౌట్ బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ మదిలో కూడా కలిగింది.

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ తర్వాత వరుసగా కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు టీమిండియా కెప్టెన్ ఎవరనే డౌట్ బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ మదిలో కూడా కలిగింది. అయితే టీమిండియాకి శుభమన్ గిల్ లేదా రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత బుమ్రాను కూడా కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే బుమ్రా తరచుగా గాయాలకు గురికావడంతో కెప్టెన్ గా నియమించడానికి ఆలోచిస్తోంది. అయితే ఇప్పుడు టీమిండియాకి గిల్, రిషబ్ పంత్, బుమ్రా కాకుండా మరో పేరు కూడా వినిపిస్తోందని స్పోర్ట్స్ కథనాలు పేర్కొ్ంటున్నాయి.
ఓ స్పోర్ట్స్ కథనం ప్రకారం టీమిండియా టెస్ట్ విభాగంలో రిషబ్ పంత్, గిల్ కేవలం ప్లేయర్లుగా మాత్రమే ఉంటారని తెలుస్తోంది. మేనేజ్మెంట్ వీరిని కెప్టెన్లుగా తీసుకోవడం లేదట. రవీంద్ర జడేజాకు కెప్టెన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా కంటే బుమ్రా కెప్టెన్ రేసులో మొదటి ప్లేస్‌లో ఉన్నారు. అయితే బుమ్రా ఎక్కువగా గాయాల బారిన పడుతుంటారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజాకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రవీంద్ర జడేజాను యాజమాన్యం ఎంపిక చేస్తుందని టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్ కథనాలు చెబుతున్నాయి. రవీంద్ర జడేజా బౌలింగ్ మాత్రమే కాదని, బ్యాటింగ్‌లో కూడా అదరగొడతాడు. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాకు భారీ విజయాలు కావాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే వారినే ఎంపిక చేయడానికి యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రా, రవీంద్ర జడేజా వంటి బలమైన క్రికెటర్లలో ఎవరో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
టీమిండియా వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియా ఏకంగా ఐదు టెస్టులు ఆడనుంది. టీమ్ ఇండియా ఈ సిరీస్ ద్వారా 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ మొదలు పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా ఆడే అతిపెద్ద టెస్ట్ సిరీస్‌లలో ఇదే పెద్ది. ఈ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో కూడా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. కాకపోతే ముందు ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది. సో ఇదే అతిపెద్ద టెస్ట్ సిరీస్. ఇందులో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరచాలంటే మాత్రం తప్పకుండా సారధిపైనే ఉంటుంది. జట్టును బలంగా ముందుకు నడిపించి విజయాన్ని అందించే వారినే కెప్టెన్‌గా నియమించాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకే రవీంద్ర జడేజా, బుమ్రా వంటి వారిని కెప్టెన్‌గా నియమించాలని యాజమాన్యం చూస్తోంది. మరి టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరు అవుతారనే విషయం చూడాలి.
-
Team India : ఇంగ్లండ్ టూర్‌కు టీమిండియాను ప్రకటన.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే?
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్‌లన్నీ నామమాత్రం!
-
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మట్టిలో కలిసిపోవడం గ్యారెంటీ!
-
Teamindia: టీమిండియా తర్వాత కెప్టెన్ ఎవరు.. జట్టులోకి ఎవరికి ఛాన్స్ ఎక్కువంటే?
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?