Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
ఈ ప్రపంచంలో కుక్కలు ఉన్నంత విశ్వాసంగా ఇంకా ఏవీ ఉండవని అంటుంటారు. మిగతా జంతువులతో పోలిస్తే కుక్కతో మనుషులకు సంబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. కుక్కలకు ఒక్క రోజు ఏదైనా ఇస్తే చాలు.. విశ్వాసంతో అవి మనుషుల వెంటనే తిరుగుతాయి.

Drunk Owner:ఈ ప్రపంచంలో కుక్కలు ఉన్నంత విశ్వాసంగా ఇంకా ఏవీ ఉండవని అంటుంటారు. మిగతా జంతువులతో పోలిస్తే కుక్కతో మనుషులకు సంబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. కుక్కలకు ఒక్క రోజు ఏదైనా ఇస్తే చాలు.. విశ్వాసంతో అవి మనుషుల వెంటనే తిరుగుతాయి. వాటి ప్రాణాలను బలంగా పెట్టి అయినా కూడా మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. అయితే జంతువుల్లో కుక్కలను విశ్వాసంగా భావిస్తే.. ఎద్దులును చాకిరి చేసే శ్రమజీవులుగా చెబుతుంటారు. పూర్వ కాలం నుంచి ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఎద్దులు ఎంతటి బరువును అయినా లాగుతుంటాయ. పూర్వం నాగలి దున్నడం, ఎక్కడికైనా వెళ్లడానికి ఎడ్లు బండి ఇలా అన్నింట్లో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషించాయి. ఎద్దులు, ఆవులు, గేదెలు, మేకలు ఇలా అన్నింటితో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ మనుషులకు జీవనాధారం. ఇప్పుడంటే టెక్నాలజీ అంతా మారిపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం వీటితోనే ప్రజలు జీవించేవారు. వీటి నుంచి వచ్చే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వంటి వాటిని తయారు చేసి వ్యాపారం చేసుకునేవారు.
Read Also: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
ఇలా ఎన్ని లాభాలను ఇవ్వడంతో పాటు యజమానిపై ప్రేమ, నమ్మకంతో ఎద్దులు ఉంటాయి. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పటికి కొందరు వీటినే జీవనాధారం చేసుకుంటూ జీవిస్తున్నారు. అలాగే బ్రెజిల్‌లో ఓ వ్యక్తి ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయానికి కావాల్సిన యంత్ర సామాగ్రి ఉన్నప్పటికీ కూడా ఎద్దులను పెంచుతుంటాడు. విపరీతమైన ఇష్టం ఎద్దుల మీద ఉండటంతోనే పెంచాడు. అయితే అతను అధికంగా మద్యం సేవించి నడి రోడ్డు మీద పడిపోయాడు. అతనికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. ఈ సమయంలో ఆ ఎద్దు యజమానిని వెతుక్కుంటూ వెళ్లింది. చివరకు యజమాని దొరకడంతో రోడ్డుపైన ఉన్న అతన్ని నాలుకతో శరీరం మొత్తం పైకి లేచే విధంగా అతన్ని లేపింది.
Read Also: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
వెనక నుంచి యజమాని తలను తోసుకుంటూ ఇంటి వరకు తీసుకొచ్చింది. ఎద్దు ఇలా మనిషికి విశ్వాసంగా పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గతంలో ఎప్పుడో జరిగింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరికొందరు ఫేక్ అని అంటున్నారు. ఎక్కడైనా ఎద్దు ఇలా చేస్తుందా? కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడానికే ఇలా చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతా ఎక్కువగా తాగి పడి ఉంటే ఒక మనిషిని ఎద్దు ఎలా తీసుకెళ్తుందని అంటున్నారు. మరికొందరు ఆ ఎద్దు చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఎద్దు తన విశ్వాసాన్ని చాటుకుందని చెప్పవచ్చు.
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
-
Monalisa : మోనాలిసా డైమండ్ మెరుపులు చూశారా.. బ్లాక్ సూట్‌లో మెరిసిన బ్లాక్ బ్యూటీ
-
Bigg Boss 9: నాగార్జున్ ఔట్.. బాలయ్య ఇన్.. హోస్టింగ్‌పై క్లారిటీ ఇదే!
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!