UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
UPI Payments : ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అసలు ఆలోచించడం లేదు. డబ్బు చేతిలో లేకపోతే వేరే వస్తువుల గురించి,

UPI Payments : ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అసలు ఆలోచించడం లేదు. డబ్బు చేతిలో లేకపోతే వేరే వస్తువుల గురించి, అనవసరమైన వాటి గురించి థింక్ కూడా చేసే వారు కాదు. కానీ ఇప్పుడు ఆ థింకింగ్ తగ్గిపోయింది. వెంటనే కొనేస్తున్నారు. ఒకప్పుడు డబ్బులు లేకపోతే ఆగిపోయే వారు, కానీ ఇప్పుడు అలాంటిది కనిపించడం లేదు. వెంటనే కొనేస్తున్నారు. మరి దీనికి కారణాలు మీకు తెలుసా? అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందామా.
UPI.. దీని గురించి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఇది వచ్చి భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మార్చివేసింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కూరగాయల మార్కెట్ వరకు మీరు ఎక్కడికి వెళ్లినా సరే యూపీఐ చేసే అవకాశం ఉంది. ఈ UPI ద్వారా రోజువారీ వస్తువులను కొనుగోలు చేయడమే కాదు.. ఖరీదైన గృహోపకరణాలు, ఖరీదైన గాడ్జెట్‌లు, డిజైనర్ దుస్తులకు బిల్లులు కూడా చెల్లిస్తున్నారు.
భారతదేశం తన చెల్లింపు వ్యవస్థను డిజిటలైజ్ చేయడం, నగదు వినియోగాన్ని తగ్గించడంలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది.అయితే ఈ కొత్త మార్పులు మంచిని పంచుతే చెడును కూడా అందిస్తాయి. UPI కూడా ప్రజలను వృధా ఖర్చులకు బానిసలుగా మారుస్తోంది. అవసరం లేని వాటిని కూడా కొనేస్తున్నారు. ఈ UPI/QR కోడ్ ద్వారా కొనుగోళ్లు పెరగడానికి అతిపెద్ద కారణం స్మార్ట్‌ఫోన్‌లు. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు, డేటాను ఉపయోగిస్తున్నారు. వారు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏ వస్తువుకైనా క్షణాల్లో చెల్లింపు చేయవచ్చు. ఇది కూడా అనవసర ఖర్చులకు ఒక కారణంగా మారుతోంది.
UPI, ఇతర డిజిటల్ చెల్లింపుల వల్ల దాదాపు 74 శాతం మంది ప్రజలు ‘అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారని గతంలో IIT ఢిల్లీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. నిజానికి, నగదుతో పోలిస్తే డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేయడం చాలా సులభం. కొన్నిసార్లు, మీకు నగదు మార్పు సమస్య ఎదురైతే, లేదా ఆ సమయంలో మీ దగ్గర అంత డబ్బు లేకపోతే, మీరు షాపింగ్ మానేస్తారు కూడా. అంటే ఛేంజ్ లేకపోయినా మిగిలిన డబ్బు తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా, లేదంటే కాస్త తక్కువ అయినా సరే షాపింగ్ చేసేవారు కాదు. దీని వల్ల మీకు డబ్బు ఆదా అయ్యేది. కానీ ఇప్పుడు ఈ సమస్య లేదు. మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉన్నా, అది మీ చేతిలో ఉన్నట్టు.
ఇక క్రెడిట్ కార్డుల వంటి మార్గాలను ఉపయోగించి కూడా మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఖర్చు చేసే వారు కూడా ఉన్నారు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిల్చున్న చోటునే పని అయిపోతే డబ్బు వాల్యూ ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఇలాంటి వారిలో మీరు కూడా ఒకరా? అది మాత్రమే కాదు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అయినా సరే అప్పు తీసుకొని మరీ షాపింగ్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం డిజిటల్ మోడ్ నడుస్తుంది కదా.. ఈ రకమైన సౌకర్యం వల్ల వృధా ఖర్చు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి చేతిలో నగదు ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా డేటా ప్రకారం ఏప్రిల్‌లో UPI లావాదేవీల సంఖ్య 1,330 కోట్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన 50 శాతం పెరుగుదల ఉంది. గత సంవత్సరం, UPI లావాదేవీలు దాదాపు 60 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.11,768 కోట్లకు చేరుకున్నాయి.
భారతదేశంలో వినియోగదారుల వ్యయం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు కార్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర వస్తువుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తోంది. అయితే, UPI కారణంగా, ప్రజలు కొన్ని అధిక ధర గల వస్తువులపై అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కూడా గమనించవచ్చు. ఇక ఈ ధోరణి నిరంతరం పెరుగుతోనే ఉంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Digital Payments: డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియా సరికొత్త రికార్డు
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Paytm Solar Sound Box: వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇకపై సోలార్‌తో పేటీఎం సౌండ్ బాక్స్
-
Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ దేశాల్లో ఇకపై ఈజీగా చెల్లింపులు