Car to Last Longer: కారు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే.. ఈ మిస్టేక్స్ చేయవద్దు
లక్షలు పెట్టి కొన్న కారు ఎక్కువ రోజులు రావాలని చాలా మంది అనుకుంటారు. ఏ వస్తువు అయిన కూడా ఎక్కువ రోజులు రావాలంటే అది మనం వాడే పద్ధతి బట్టి ఉంటుంది. అయితే కారు విషయంలో కొందరు తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కారు తొందరగా పాడవుతుంది

Car to Last Longer: లక్షలు పెట్టి కొన్న కారు ఎక్కువ రోజులు రావాలని చాలా మంది అనుకుంటారు. ఏ వస్తువు అయిన కూడా ఎక్కువ రోజులు రావాలంటే అది మనం వాడే పద్ధతి బట్టి ఉంటుంది. అయితే కారు విషయంలో కొందరు తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కారు తొందరగా పాడవుతుంది. అయితే కారు విషయంలో తెలిసో తెలియక కొన్ని మిస్టేక్స్ చేయకపోతే మాత్రం తప్పకుండా కారు ఎక్కువ రోజులు ఉంటుంది. మరి ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆయిల్స్ చెక్ చేయడం
కొందరు కారు బయటకు బాగానే ఉందని ఏం మార్చరు. కారు ఎంత మంచిగా ఉన్నా కూడా అప్పుడప్పుడు మార్చాలి. ఎంత కారు పైకి మంచిగా కనిపిస్తున్నా కూడా ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, కూలెంట్, విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ వంటి ఆయిల్స్ తప్పకుండా మార్చాలని నిపుణులు అంటున్నారు. కారు లోపల వీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే మాత్రం పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అయితే కారు బాగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
Read also: ప్రేమ పేరుతో మోసం.. రూ.30 కోట్ల డబ్బుతో ప్రియురాలు జంప్.. కోర్టుకెక్కిన ప్రియుడు!
వైపర్ బ్లేడ్లు
కారుకు వైపర్ బ్లే్డ్లు కూడా మార్చాలి. ఇవి పాడైన వెంటనే మార్చకపోతే మాత్రం గ్లాస్ దెబ్బతింటుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే వైపర్ మార్చుకుంటే తక్కువ మొత్తంలో తేలిపోతుంది. అయితే బ్లేడ్‌లను కూడా ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాలి. ఇలా చేస్తే అవి మంచిగా ఉంటాయి.
బ్రేకులు చెక్ చేసుకోవడం
భద్రత కోస కారు బ్రేక్‌లను చెక్ చేసుకోవాలి. బ్రేక్ ప్యాడ్‌లు, రోటర్‌లు అరిగిపోతుంటాయి. వీటిని కూడా చెక్ చేసుకుని మార్చుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
బ్యాటరీ
కారు బ్యాటరీ పాడవకుండా చెక్ చేసుకోవాలి. తుప్పు, లీకేజీ వంటి సమస్యలు ఉంటాయి. వీటిని చెక్ చేసుకుని మార్చేయాలి. అలాగే బ్యాటరీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉన్నా కూడా చెక్ చేసి వెంటనే మార్చేయాలి. వీటితో పాటు బ్యాటరీ మూతలు తీసి లోపల లిక్విడ్ లెవల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒక్కోసారి చెక్ చేసుకోవాలి. అయితే బ్యాటరీ మెయింటనెన్స్ మంచిగా ఉంటే ఎలాంటి సమస్యలు కూడా రావు.
Read Also: జూన్‌లో ఇవి అస్సలు మర్చిపోవద్దు.. అన్నీ టైమ్‌లో చేసుకుంటే పర్ఫెక్ట్!
టైర్ల
కొందరి టైర్లు అరిగిపోయి ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండటం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. టైర్లలో పగుళ్లు ఉంటే మాత్రం వెంటనే వాటిని మార్చేయండి. లేకపోతే మాత్రం పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే టైర్లలో గాలి తక్కువగా ఉన్నా కూడా చెక్ చేసుకోండి. దీనివల్ల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు వీటికి సర్వీసింగ్ చేస్తుండాలి. అప్పుడే కారు ఎక్కువ రోజులు వస్తుంది.
-
Tibetan prayer flags: బైక్‌కు ఈ రంగుల జెండా ఎందుకు కడతారో మీకు తెలుసా?
-
Hyundai Venue Sales: రూ.7.94 లక్షలకే క్రెటా లాంటి SUV.. 6.68 లక్షల మంది అభిమానం చూరగొన్న హ్యుందాయ్ వెన్యూ
-
Tata Nano: అసంపూర్ణంగా రతన్ టాటా కోరిక.. తన డ్రీమ్ కారుతో ఆయన చేయాలనుకున్న పని ఇదే!
-
Credit Card: లిమిట్‌కి మించి క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్
-
Public Wifi: పబ్లిక్ వైఫే ఎక్కువగా వాడుతున్నారా.. ఇది మీ కోసమే
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..