Public Wifi: పబ్లిక్ వైఫే ఎక్కువగా వాడుతున్నారా.. ఇది మీ కోసమే

Public Wifi: ప్రస్తుతం రోజుల్లో ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎవరు చూసినా కూడా మొబైల్ వాడుతూ.. కనిపిస్తున్నారు. నెట్ వాడకం ఎక్కువగా పెరగడంతో చాలా మంది ఇంట్లో వైఫై పెట్టించుకుంటున్నారు. ఇవే కాకుండా బయటకు వెళ్లినప్పుడు కూడా ఇతరుల వైఫై వాడుతున్నారు. ఎందుకంటే మొబైల్‌కి రీఛార్జ్ చేసుకున్న నెట్ కేవలం ఒక్క గంటలోనే అయిపోతుంది. దీంతో బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా వైఫై వాడుతారు. ఫ్రీగా వస్తుందని ఎక్కువగా వైఫై వాడుతున్నారనుకోండి.. కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. కాఫీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ పడితే అక్కడ వైఫే వాడకూడదని అంటున్నారు. అయితే ఇలా ఎక్కడ పడితే అక్కడ వైఫే వాడటం వల్ల ఎంత డేంజర్ ఈ స్టోరీలో చూద్దాం.
పబ్లిక్ వైఫైను ఎక్కువగా వాడటం వల్ల సెక్యూరిటీ ఉండదు. మీ వ్యక్తిగత డేటా అంతా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి కొన్ని వైఫై నెట్‌వర్క్ వల్ల మొబైల్ డేటా అంతా కూడా హ్యాక్ చేస్తారు. దీనివల్ల మీ డబ్బులు లేదా పర్సనల్‌కి పోగొట్టుకుంటారు. అయితే పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లావాదేవీలు చేయకూడదు. కొందరు పబ్లిక్ వైఫైతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో పేమెంట్స్ చేస్తుంటారు. దీనివల్ల బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ వైఫైతో అసలు పేమెంట్స్ చేయవద్దు. ఇలా కేవలం డబ్బులు మాత్రమే కాదు.. డేటా కూడా హ్యాక్ అవుతుంది. అయితే పబ్లిక్ వైఫైలో కొన్ని తెలియని లింక్స్ కూడా వాడకూడదు. వీటివల్ల మీ బ్యాంక్ అకౌంట్‌ల పాస్‌వర్డ్‌లు అన్ని కూడా లీక్ అవుతాయి. కాబట్టి ఇలాంటి లింక్స్, ఈమెయిల్స్‌ను కూడా బయట వైఫైతో అసలు ఓపెన్ చేయకూడదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి.
ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఖాళీగా ఉండకుండా కంటిన్యూ కూడా వైఫై వాడుతున్నారు. ఆ వైఫై సెక్యూరిటీ? కాదా? అని ఆలోచించకుండా తెగ వాడేస్తుంటారు. ఇలా ఎక్కువగా వాడటం వల్ల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీన్నే అలుసుగా తీసుకుని.. హ్యాకర్లు డబ్బులు కాజేస్తున్నారు. వీటితో పాటు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలా సైబర్ క్రైమ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇకనైనా ఇలాంటి వాటికి జరగకుండా ఉండాలంటే మాత్రం పబ్లిక్ వైఫై వాడకాన్ని కాస్త తగ్గించాలి. అప్పుడే ఇలాంటి సైబర్ క్రైమ్‌లు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.