Maha sivaratri: మహా శివరాత్రి నాడు ఈ మిస్టేక్స్ చేశారో.. దరిద్రమంతా ఇక మీతోనే!

Maha sivaratri:
శివుని భక్తులు ఎంతగానో ఎదురుచూసే మహా శివరాత్రి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని భక్తులు జరుపుకుంటారు. పరమ శివుడిని భక్తితో పూజించడం వల్ల చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. పవిత్రమైన మహా శివరాత్రి నాడు భక్తులు ఎంతో భక్తితో శివుడిని పూజించాలి. కొన్ని నియమాలు, ఆచారాలు పాటిస్తూ పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ మహా శివరాత్రి అనేది చాలా పవిత్రమైనది. ఇంతటి పవిత్రమైన రోజు వేకువ జామునే లేచి శివునికి అభిషేకం చేయాలి. అలాగే మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా శివయ్యను స్మరించాలి. ముఖ్యంగా ఉదయాన్నే తొందరగా లేచి శివునికి అభిషేకం, పూజ ఆచరించాలి. అయితే కొందరికి తెలియక ఈ మహా శివరాత్రి నాడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని ఉంటుంది. అలాగే ఏ పని మొదలు పెట్టినా కూడా జరగదు. పాపాలు తగ్గకుండా ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి మహా శివరాత్రి నాడు కొన్ని తప్పులు చేయకుండా నియమాలు పాటిస్తూ భక్తితో శివుడిని పూజించాలి. అయితే మహా శివరాత్రి నాడు చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మహా శివరాత్రి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లని దుస్తులు ధరించవద్దు. కేవలం తెలుపు దుస్తులు ధరిస్తేనే ఫలితం ఉంటుంది. ఎందుకంటే శివుడికి నలుపు దుస్తులు అసలు నచ్చవు. తెల్లని దుస్తులు అంటే ఇష్టం. అలాగే శివుడిని ఎర్రని పువ్వులతో పూజించవద్దు. ఎందుకంటే శివుడికి ఎర్రని పువ్వులు అంటే అసలు ఇష్టం ఉండదు. అలాగే తులసి ఆకులను శివుడికి సమర్పించవద్దు. వీటితో పాటు కంచు పాత్రలో నైవేద్యం పెట్టడం చేయకూడదు. శివరాత్రి రోజున ఉపవాసం ఆచరించాలి. అసలు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిని అసలు తినకూడదు. అలాగే మాంసం, వెల్లుల్లి, మద్యపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఈ పనులు కానీ మహా శివరాత్రి నాడు చేస్తే మాత్రం దరిద్రమంతా మీతోనే ఉంటుంది.
మహా శివునికి అభిషేకం చాలా ఇష్టం. మీరు భక్తితో అభిషేకం చేసి ఎలాంటి కోరికలు కోరినా కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇంట్లో లేదా ఆలయంలో అయినా మహా శివుడికి అభిషేకం చేయండి. పెరుగు, పాలు, పంచదార, చెరకు రసం, పువ్వులు, బిల్వ పత్రాలు, చందనం ఇలా అన్నింటితో మొదటి శివుడిని అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి భక్తితో శివుడిని ధ్యానించాలి. ఓం నమ: శివాయ అంటూ శివుడిని భక్తితో పూజించాలి. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మనస్సులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా శివుడిని పూజించాలి. అప్పుడే పుణ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
-
Vastu Tips: వారం రోజులు ఇలా చేస్తే చాలు.. మీ ఇళ్లంతా డబ్బే డబ్బు
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే
-
Bhauma Pradosha Vratam: శివుడు ఆశీస్సులు పొందాలంటే.. నేడు భౌమ ప్రదోష వ్రతం ఆచరించాల్సిందే