Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?

Maha Shivaratri:
సంక్రాంతి తర్వాత వచ్చే మహా శివరాత్రి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. దీన్ని అమావాస్య ముందు చతుర్దశి తిథిలో జరుపుకుంటారు. మాఘ మాసంలోని అమావాస్యకు ముందు వచ్చే తిథి. అయితే పురాణాలు ప్రకారం శివుడు ఈ మహా శివరాత్రి రోజున లింగాకారంగా పుట్టాడని అంటారు. అసలు మహా శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? దీని విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహా శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా భక్తులు జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు శివాలయాలు అన్ని కూడా భక్తులతో నిండిపోతాయి. సాధారణంగా అన్ని దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తారు. కేవలం శివుడిని మాత్రం లింగాకారంలో పూజిస్తారు. అయితే ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్పనే చర్చ వచ్చింది. ఈ సమయంలో వీరి మధ్య గొడవను చూసి ఇతర దేవతలు శివుని ఆపమన్నారు. ఆ సమయంలో శివుడు వారి మధ్య అగ్ని స్తంభం లాగా ఒక లింగాకారంలో ఆవిర్భవించాడు. ఎవరైతే ఈ అగ్ని స్తంభం మొదటి, చివరి పాయింట్‌లను కనిపెడతారో వారే గొప్ప అని శివుడు అంటాడు. ఇద్దరూ చెరో వైపు వెళ్లినా కూడా వాటి పాయింట్‌లను కనిపెట్టలేకపోయారు. బ్రహ్మ వచ్చి అగ్ని అంతాన్ని చూశానని చెబుతాడు.
విష్ణువు మాత్రం గొప్పతనం తెలుసుకుంటాడు. అయితే బ్రహ్మ చేసిన మోసం తెలుసుకుని శివుడు కోపానికి గురి అవుతాడు. బ్రహ్మను శిక్షించడం కోసం అగ్ని లింగ స్వరూపంగా శివుడు పుడతాడు. అప్పుడు విష్ణువు నమస్కరించగా.. శివుడితో పాటు విష్ణువుకి కూడా పూజలు చేయాలని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మకు శివుడు శాపం ఇస్తాడు. అసలు పూజలు ఉండవుని శపిస్తాడు. ఇలా శివుడు లింగాకారంలో ఈ తిథి నాడు ఉద్భవించాడని అందుకే మహా శివరాత్రిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. పరమ శివుడు అర్థ రాత్రి సమయంలో ఇలా అగ్ని స్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించాడు. అందుకే మహా శివరాత్రి రోజున రాత్రంతా జాగారం ఉంటారు. ఆ సమయంలోనే శివునికి అభిషేకాలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే బ్రహ్మ అబద్ధం చెప్పిన సమయంలో అతనికి మొగలి పువ్వు సాయం చేస్తుంది. దీంతో ఈ పువ్వును పూజకు ఉపయోగించకూడదని శివుడు శపిస్తాడు. అందుకే శివుని పూజకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగలి పువ్వును ఉపయోగించరు. ఈ పువ్వుతో శివుని పూజిస్తే కోపం వస్తుంది. కోరిన కోరికలు కూడా నెరవేరవని పండితులు చెబుతున్నారు.
-
Vastu Tips: వారం రోజులు ఇలా చేస్తే చాలు.. మీ ఇళ్లంతా డబ్బే డబ్బు
-
Maha Shivaratri 2025 : మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ మహా శివరాత్రికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
-
Maha Shivaratri 2025: శివుని మూడవ కన్ను నుంచి తాండవం వరకు ఏం నేర్పుతుందో తెలుసా?
-
Maha Shivaratri: ప్రతీ ఏటా పెరుగుతున్న శివ లింగం.. ఇంతటి పవిత్రమైన లింగం ఎక్కడుందంటే?
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు