Maha Shivaratri: ప్రతీ ఏటా పెరుగుతున్న శివ లింగం.. ఇంతటి పవిత్రమైన లింగం ఎక్కడుందంటే?

Maha Shivaratri:
దేశంలో ఎన్నో ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలు అయితే పురాణ కాలం నుంచే ఉంటాయి. ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి. అయితే ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి శివాలయాల్లో భూతేశ్వర్ నాథ మహాదేవ్ ఆలయం ఒకటి. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరీయాబంద్ జిల్లాలో ఉంది. శైవ క్షేత్రాల్లో ఇది ప్రసిద్ధమైనది. ఆ శివ లింగానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ లింగం ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంటుందట. ఈ శివాలయానికి ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా మహా శివరాత్రి సమయాల్లో ఈ ఆలయం ఇంకా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయం దూరం నుంచి చూస్తే పెద్ద శిలలా కనిపిస్తుంది. అలా దగ్గరకు వెళ్లే కొద్ది శివలింగం అని తెలుస్తుంది. ఈ శివ లింగానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఏటా శివ లింగం పెరుగుతుండటంతో ఈ లింగాన్ని చూడటానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. ఈ శివాలయం స్వయంభువగా గుర్తింపు పొందింది. పూర్వం ఈ లింగం చిన్నగా ఉండేదని ఇప్పుడు పెద్దదిగా తయారు అయ్యిందని స్థానికులు చెబుతుంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ ఓ అడవి ఉండేదట. అక్కడ ఓ చిన్న శిల రూపం కనిపించింది. ఓ జమీందారు చూసి పూజలు నిర్వహించడంతో అలా పెరిగిందట. దీంతో ఈ శివ లింగాన్ని అలా ఆరు బయట వదిలేశారు. కార్తీకం, శ్రావణం, శివరాత్రి సమయాల్లో ఎక్కువగా భక్తులు దర్శించుకుంటారు.
ఇదిలా ఉండగా మహా శివరాత్రి నాడు అందరూ శివుడి భక్తిలో లీనమైపోతారు. శివుడిని వేకువ జామున లేచి.. పూజించాలి. ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించి శివుడిని పూజించాలి. పండ్లు, పువ్వులు, అభిషేకం, నైవేద్యం పెట్టాలి. శివుడికి అభిషేకం చాలా ముఖ్యమైనది. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాతే పూజ చేయాలి. పాలు, పెరుగు, పంచదార, కొబ్బరి నీరు, మంచి నీటితో అభిషేకం చేస్తారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. వీటితో ఇంట్లో లేదా శివాలయంలో పూజ చేయాలి. శివరాత్రి పూజను ఆచరించిన వారు ఉపవాసం, జాగరణ కూడా తప్పకుండా చేస్తారు. జాగరణ చేసే వారు ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. రాత్రంతా సినిమాలు చూడటం, బయట తిరగడం ఇలా టైమ్ పాస్ చేయకూడదని పండితులు చెబుతున్నారు. శివుడిని ధ్యానం చేస్తూ.. రాత్రంతా జాగరణ చేయాలి. ఇలా చేస్తేనే పుణ్యం దక్కుతుంది.
-
Maha Shivaratri 2025 : మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ మహా శివరాత్రికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
-
Maha Shivaratri 2025: శివుని మూడవ కన్ను నుంచి తాండవం వరకు ఏం నేర్పుతుందో తెలుసా?
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?
-
Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే
-
Maha Shivaratri: మహా శివరాత్రి నుంచి ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు.. ఈ లిస్ట్‌లో మీ రాశి ఉందా?