Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

Maha Shivaratri:
శివుడికి ఇష్టమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి. వీటిని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. మహా శివరాత్రి రోజునే కాకుండా శివుడిని ఎప్పుడైనా వీటితో పూజిస్తే పుణ్యం కలుగుతుంది. అలాగే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. హిందూ పూజల్లో ఈ బిల్వ పత్రాలను తప్పకుండా ఉపయోగిస్తారు. వీటిని చాలా ప్రత్యేకంగా కొలుస్తారు. ఏవైనా బలమైన కోరికలు ఉంటే మాత్రం ఈ ఆకులను శివుడికి సమర్పి్స్తే తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. అయితే బిల్వ పత్రాలను కేవలం పూజల పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. బిల్వ పత్రాల్లో ఎక్కువగా విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B1, విటమిన్ B6 వంటివి ఉండటంతో పాటు కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇవి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అయితే ఈ బిల్వ పత్రాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
జీర్ణ సమస్యలు
ఈ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కొందరు మలబద్ధకం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ బిల్వ పత్రాలు బాగా ఉపయోగపడతాయి.
ఐరన్ లోపం
కొందరికి రక్తహీనత ఉంటుంది. అలాంటి వారు ఈ ఆకుల రసాన్ని డైలీ తాగడ వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రోజూ ఒక గ్లాసు నీటిలో బిల్వ పత్రాల రసాన్ని కలిపి తాగడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
బిల్వ పత్రాలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని డైలీ నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎలాంటి గుండె ప్రమాదాలు కూడా రావని నిపుణులు అంటున్నారు.
పైల్స్
ఈ రోజుల్లో చాలా మంది పైల్స్‌తో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బిల్వ పత్రాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. దీంతో పైల్స్ సమస్య క్లియర్ అవుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల
బిల్వ పత్రాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుుతంది. అయితే వీటిని పరగడుపున తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందుతారు. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని నమలడం లేదా నీటిలో మరిగించి తాగడం వల్ల మధుమేహం కూడా తగ్గుతుంది.
-
Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Maha Shivaratri 2025 : మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ మహా శివరాత్రికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
-
Maha Shivaratri 2025: శివుని మూడవ కన్ను నుంచి తాండవం వరకు ఏం నేర్పుతుందో తెలుసా?
-
Maha Shivaratri: ప్రతీ ఏటా పెరుగుతున్న శివ లింగం.. ఇంతటి పవిత్రమైన లింగం ఎక్కడుందంటే?
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?