Heart Health: ఈ చిప్స్ తింటే హార్ట్ స్ట్రోక్ తప్పదా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Heart Health: అందరికి ఇష్టమైన స్నాక్స్‌లో బంగాళాదుంప చిప్స్ ఒకటి. కరకరలాడుతూ ఉండే ఈ చిప్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తింటారు. ఉదయం లేచిన వెంటనే వీటితో కొందరు డేని స్టార్ట్ చేస్తుంటారు. అయితే ఈ రుచికరమైన చిప్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా వినరు. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అధికంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే లిమిట్‌లో కాకుండా అధికంగా తీసుకోవడం వల్ల గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంపై ప్రభావం
బంగాళాదుంప చిప్స్‌లో నూనె, ఉప్పు, కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు (ట్రాన్స్ ఫ్యాట్) పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. బంగాళాదుంప చిప్స్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 28% ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక సోడియం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
జీర్ణ సమస్యలు
చిప్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిలో పీచుపదార్థాలు (ఫైబర్) తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
మధుమేహం, బరువు పెరుగుదల
బంగాళాదుంప చిప్స్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి చాలా హానికరం. చిప్స్‌లో కేలరీలు అధికంగా ఉండటం వల్ల వీటిని తరచుగా తినడం ద్వారా శరీర బరువు పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. అది ఊబకాయానికి దారితీసి, అనేక ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందని అంటున్నారు.
క్యాన్సర్ ముప్పు
బంగాళా దుంపలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించినప్పుడు ‘అక్రిలమైడ్’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే చిప్స్‌లో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించలేవు. దీర్ఘకాలికంగా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, వివిధ వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?