Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

Cardiac Arrest : ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా కుప్పకూలిపోవడం కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. చాలామంది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే అని అనుకుంటారు. కానీ, అవి రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుందాం ఎందుకంటే, సరైన సమయంలో సహాయం అందకపోతే కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ ఎటాక్ కంటే చాలా ప్రమాదకరమైనది.. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది.
కార్డియాక్ అరెస్ట్‌ను అర్థం చేసుకోవాలంటే.. ఇది మన గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చే లోపం వల్ల వస్తుంది. సాధారణంగా మన గుండె ఒక క్రమ పద్ధతిలో కొట్టుకోవడానికి కొన్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అవసరం. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ విద్యుత్ సంకేతాల్లో అకస్మాత్తుగా గందరగోళం ఏర్పడి, గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ వెంటనే ఆగిపోతుంది. మెదడుతో సహా శరీరంలోని ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందదు.
Read Also:Thammudu Movie Twitter Review: ‘తమ్ముడు’ ట్విట్టర్ రివ్యూ..!
కార్డియాక్ అరెస్ట్ అనేది చాలాసార్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వస్తుంది. రోగికి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లేదా చెప్పే సమయం కూడా దొరకదు. అందుకే, ఇది హార్ట్ ఎటాక్ కంటే ప్రమాదకరం. గుండె ఆగిపోయిన 2 నుండి 4 నిమిషాల్లో CPR లేదా వెంటనే వైద్య సహాయం అందకపోతే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్ తేడాలు
హార్ట్ ఎటాక్: ఇది గుండె కండరాలకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో బ్లాకేజీ వల్ల వస్తుంది. దీనివల్ల గుండె కండరాలకు రక్తం అందక, అవి దెబ్బతింటాయి. దీని ప్రభావం సాధారణంగా నెమ్మదిగా మొదలవుతుంది. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు, చికిత్స తీసుకోవడానికి రోగికి కొంత సమయం దొరుకుతుంది. ఆసుపత్రిలో మందులతో లేదా సర్జరీతో చికిత్స చేయవచ్చు.
Read Also:Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్లో తింటే ప్రాణాలు గోవిందా!
కార్డియాక్ అరెస్ట్: ఇది గుండెలోని ఎలక్ట్రిక్ సిస్టమ్ లో లోపం వల్ల వస్తుంది. గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయి, మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందదు. ఇది చాలాసార్లు ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా జరుగుతుంది. ఇలాంటప్పుడు, వెంటనే CPR లేదా డిఫిబ్రిలేటర్ ద్వారా షాక్ థెరపీ ఇవ్వడం చాలా అవసరం. ప్రతి నిమిషం ఆలస్యం మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి?
అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, శ్వాస ఆడకపోవడం, గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోవడం, కొన్ని సందర్భాల్లో, ముందుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఆందోళన అనిపించవచ్చు. కొన్ని సార్లు కళ్ళు తెరిచి ఉన్నా, ఎటువంటి ప్రతిస్పందన చూపకపోవడం కూడా దీని లక్షణమే.
కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి?
కార్డియాక్ అరెస్ట్ అనేది అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తక్షణమే చర్య తీసుకోవాలి. వెంటనే CPR మొదలు పెట్టాలి. ఇది గుండెను చేతులతో నొక్కుతూ, నోటితో శ్వాస ఇవ్వాలి. ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే, దాన్ని వెంటనే ఉపయోగించాలి. ఇది గుండెకు షాక్ ఇచ్చి, దాన్ని మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. వెంటనే 108 లేదా దగ్గరలోని ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. ప్రతి నిమిషం ఆలస్యం మరణ ప్రమాదాన్ని పెంచుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
-
Daily Bread : రోజూ బ్రెడ్ తింటున్నారా.. ఈ మెదడు వ్యాధి రావచ్చట.. తస్మాత్ జాగ్రత్త
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
-
BTB Juice: ఏబీసీ కాదు.. ఈ జ్యూస్ తాగితే సర్వ రోగాలు పరార్
-
Heart Health: ఈ చిప్స్ తింటే హార్ట్ స్ట్రోక్ తప్పదా.. నిపుణులు ఏమంటున్నారంటే?