BTB Juice: ఏబీసీ కాదు.. ఈ జ్యూస్ తాగితే సర్వ రోగాలు పరార్

BTB Juice: ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఏబీసీ జ్యూస్ తాగుతుంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. ఏబీసీ జ్యూస్ అంటే ఆపిల్, బీట్రూట్, క్యారెట్‌తో కలిపి తయారు చేస్తారు. అయితే ఈ మూడింటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. డైలీ ఏదో ఒక సమయంలో ఈ జ్యూస్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే మలబద్ధకం తగ్గడం, చర్మ ఆరోగ్యం మెరవడం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఏబీసీ జ్యూస్ కాకుండా బీటీబీ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంతకీ బీటీబీ జ్యూస్ అంటే ఏంటి? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
బీటీబీ జ్యూస్ అంటే టమాటా, సొరకాయ, బీట్‌రూట్ కలిపి తయారు చేస్తారు. ఈ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. టమాటాలోని లైకోపీన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త నాళాలను కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. టమాటా, సొరకాయలలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. సొరకాయలో నీటి శాతం, బీట్‌రూట్‌లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. బీటీబీ జ్యూస్ చర్మానికి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది.
బీట్‌రూట్ రసం చర్మంలో రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్, విటమిన్ సి చర్మాన్ని ఎండ నుంచి కాపాడి, మచ్చలను తగ్గిస్తాయి. ఈ జ్యూస్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది. మీ ఆరోగ్యం కోసం ఈ అద్భుతమైన బీటీబీ జ్యూస్‌ను డైలీ తాగితే మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణలు అంటున్నారు. సొరకాయలో అధిక నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్‌లోని ఫైబర్, సహజ నైట్రేట్లు జీర్ణ ఎంజైమ్‌లను పెంచి, మంచి గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ సులభంగా జరిగి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?