Daily Bread : రోజూ బ్రెడ్ తింటున్నారా.. ఈ మెదడు వ్యాధి రావచ్చట.. తస్మాత్ జాగ్రత్త

Daily Bread : ప్రస్తుత బిజీ జీవితంలో బ్రెడ్ చాలా మందికి ఉదయం అల్పాహారం అయిపోయింది. తక్కువ సమయంలో టకటకా తినేసి ఎవరి పనుల్లో వాళ్లు వెళ్లిపోతున్నారు. రకరకాల రుచులలో లభిస్తుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది నేడు ఇష్టంగా మారిపోయింది. నేడు చాలా మంది ఉదయాన్ని బ్రెడ్ జామ్ లేదా బ్రెడ్-వెన్నతో కానిచ్చేస్తున్నారు. అయితే, ఇలా తినడం వల్ల ఈ బ్రెడ్ అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతోంది. రోజూ బ్రెడ్ తినే వారికి శారీరక సమస్యలు మాత్రమే కాకుండా, మానసిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది.
బ్రెడ్‌లో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట. ఇది మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెడ్‌లో ఫైబర్, విటమిన్ ఇ తక్కువగా ఉంటాయి. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. బ్రెడ్లోని గ్లూటెన్, కార్బోహైడ్రేట్లు మలబద్ధకం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల బ్రెడ్‌ను ఎక్కువగా తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. దీనితో పాటు రోజూ బ్రెడ్ తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. బ్రెడ్‌లో అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు, కెమికల్స్ కలుపుతారు. ఇవి శరీరంలోని జీర్ణవ్యవస్థను ప్రభావితం చేయవచ్చు.
Read Also:Rashmika : రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించిన నాగార్జున, సల్మాన్, శేఖర్ కమ్ముల.. ఎందుకంటే ?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం.. రోజూ బ్రెడ్ తినడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావితం చూపిస్తుందని తేలింది.బ్రెడ్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ డిప్రెషన్, ఒత్తిడి, ఏకాగ్రత కోల్పోవడం వంటి మానసిక సమస్యలకు కారణం కావచ్చు. నిరంతరం బ్రెడ్ తినడం వల్ల శరీరంలో వాపు కూడా రావొచ్చు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.
రోజూ బ్రెడ్ తినడం వల్ల ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్ తయారు చేయడానికి ఈస్ట్‌ను ఉపయోగిస్తారు. రోజూ బ్రెడ్ తినడం వల్ల కడుపులో ఈస్ట్ పరిమాణం పెరగవచ్చు. ఇలాంటప్పుడు, కడుపులో ఉండే బ్యాక్టీరియా బ్రెడ్లోని కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసినప్పుడు కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల కడుపులో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా, రోగి మద్యం తాగకుండానే మత్తుగా ఉన్నట్లు లేదా ఇతర మత్తు సంబంధిత లక్షణాలను అనుభవిస్తాడు. ఇది ఒక రకమైన మెదడు వ్యాధి.. ఇది ఎక్కువగా బ్రెడ్ తినే వారికి వచ్చే అవకాశం ఉంది.
Read Also:UIDAI New App: ఆధార్ వినియోగదారులకు అదిరిపోయే వార్త.. త్వరలోనే సరికొత్త యాప్
-
Wheat Flour : ఇంట్లో గోధుమ పిండి ఇలా వాడుతున్నారా.. మీరు అనారోగ్యం బారిన పడినట్లే
-
Kidneys : అందంగా ఉండాలని అతిగా నీళ్లు తాగుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు
-
Mobile: రోజుకి 4 గంటలకు మించి మొబైల్ చూస్తున్నారా.. ఈ వార్నింగ్ మీ కోసమే
-
Nicotine : సిగరెట్, గుట్కా మానేయలేకపోతున్నారా? .. నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు
-
Stress: ఒత్తిడి చంపేస్తుందా.. అయితే ఇలా బయటపడండి